రాష్ట్రీయం

గత ప్రభుత్వ ఒప్పందాలపై సమీక్ష తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు కుదుర్చుకున్న ఒప్పందాలపై సమీక్ష చేయడానికి (పీపీఎలపై) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సుముఖత వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని మండలి చైర్మన్ సీవీ నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం హైకోర్టులో పీపీఏలపై వ్యాజ్యం నడుస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వానికి విద్యుత్‌ను విక్రయించిన ప్రైవేట్ సంస్థలకు 50 శాతం బకాయిలను చెల్లించాలని మండలి సూచించిందన్నారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవనలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో స్వల్పంగా విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించిందని ఆయన ప్రకటించారు. అయితే, పెంచిన విద్యుత్ చార్జీలపై ఎవరైనా వినియోగదారుడు కోర్టులో సవాల్ చేయవచ్చునని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలు ఆదాయ వ్యయాల వ్యత్యాసాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. ఒకవేళ సమీక్షల్లో జాప్యం చేస్తే భవిష్యత్‌లో ఏపీ అంధకారం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల ప్రతి ఏటా ఎగబాకుతోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలు తమ మనుగడ సాధించడానికి చార్జీలను పెంచుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే వినియోగదారునిపై అధిక భారం పడకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ నియంత్రణ మండలిపై ఉందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే దిశలో భాగంగా విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన టారిఫ్
యూనిట్‌కు రూ.12.25 నుంచి 6.70కి తగ్గించిందన్నారు. పరిశ్రమలకు రాయితీలు నిలుపుదల చేస్తూ విద్యుత్ సంస్థలు తీసుకువచ్చిన ప్రతిపాదనలను తిరస్కరించామన్నారు. అలాగే విద్యుత్ వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీ ఎంతో నెలవారీ జారీ చేసే విద్యుత్ బిల్లుల వెనుక ముద్రించాలని సూచించినట్లు ఆయన చెప్పారు. పవన, సౌర విద్యుత్ సంస్థల లభ్యతను దృష్టిలో పెట్టుకుని మిగులు విద్యుత్ ఉన్నట్లు ప్రభుత్వం సూచించిందన్నారు. జాతీయస్థాయిలో విద్యుత్ నష్టాలను బేరీజు వేస్తే రాష్ట్రంలో విద్యుత్ నష్టాలు తక్కువన్నారు. విద్యుత్ సంస్థల స్థితిగతులపై మీడియా ప్రతినిధులు వార్తలు రాసేముందు వాటి పూర్వాపరాలను అవగాహన చేసుకోవాలన్నారు. తెలియక రాస్తే విద్యుత్ సంస్థలు దెబ్బతింటాయన్నారు. చట్టబద్ధమైన ఒప్పందాలు లేకుండా ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు తప్పనిసరిగా మండలి అనుమతులు తీసుకోవాలన్నారు.

*చిత్రం...హైదరాబాద్ సింగరేణి భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మండలి చైర్మన్ నాగార్జున రెడ్డి