రాష్ట్రీయం

తెలంగాణలో ఐదుగురు ఆర్‌టీఐ కొత్త కమిషనర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్‌లో కొత్తగా ఐదుగురు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జీవో 23 జారీ చేశారు. రాష్ట్ర సమాచార కమిషన్‌లో కొత్త కమిషనర్లుగా కట్టా శేఖర్‌రెడ్డి, గుగులోతు శంకర్ నాయక్, సయ్యద్ ఖలీలుల్లా , మైడా నారాయణ రెడ్డి, డాక్టర్ మహ్మద్ అమీర్ అలియాస్ డాక్టర్ మహ్మద్ అమీర్ హుస్సేన్ నియమితులయ్యారు. వారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ భేటీ జరిగింది. సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన కమిషనర్ల నియామకాలను గవర్నర్ తమిళిసై సోమవారం ఆమోదించిన రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఒక చీఫ్ కమిషనర్, తొమ్మిది మంది కమిషనర్లను నియమించుకోవాల్సి ఉంది. అయితే రెండు సంవత్సరాల క్రితమే చీఫ్ కమిషనర్ రాజా సదారామ్, కమిషనర్‌గా బుద్ద మురళిని ప్రభుత్వం నియమించింది. మిగిలిన ఖాళీల కోసం సెర్చ్ కమిటీ తాజాగా మరో ఐదుగురిని కమిషనర్లుగా ఎంపిక చేసింది. కట్టా శేఖర్‌రెడ్డి నమస్తే తెలంగాణ తెలుగు దిన పత్రిక ఎడిటర్‌గా వివిధ పత్రికల్లో 30 ఏళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. ఇటీవలనే నమస్తే తెలంగాణ పత్రికలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. నారాయణరెడ్టి టీ-న్యూస్ చానల్ సీఇవోగా పని చేశారు. గుగులోతు శంకర్‌నాయక్ గిరిజన విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. మహ్మద్ అమీర్ హుస్సేన్ 11 సంవత్సరాలుగా న్యాయవాదిగా పనిచేస్తున్నారు. సయ్యద్ ఖలీలుల్లా సైతం న్యాయవాదిగా పనిచేస్తున్నారు.