రాష్ట్రీయం

శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 11: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్సే మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు యోషిత రాజపక్సే, ఆ దేశ మంత్రి ఆర్ముగన్ తొండమాన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధాని బృందానికి రాష్టమ్రంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ఏ.వి.్ధర్మారెడ్డి మహద్వారం వద్ద సంప్రదాయబద్దంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పడికావలి నుండి ధ్వజమండపం వద్ద భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేసిన కదిలే పైకప్పు గురించి ప్రధానమంత్రికి ఈఓ వివరించారు. శ్రీలంక ప్రధాని బృందం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయక మండపం వద్దకు చేరుకున్నారు. వారికి వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ, అదనపు ఈఓ కలసి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఘనంగా వీడ్కోలు
శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్సేకు మంగళవారం ఉదయం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథిగృహం వద్ద అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. వీడ్కోలు పలికిన వారిలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు.
*చిత్రం...తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సే