రాష్ట్రీయం

విశాఖలో సీఎస్‌ఐ జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 12: కంప్యూటర్ సొసై టీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ) ఆధ్వర్యంలో రెండు రోజుల ఎపిక్-2020 సదస్సు నిర్వహించనున్నట్టు చైర్మన్ కేసీ దాస్ తెలిపారు. విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 20,21 తేదీల్లో విశాఖ గేట్‌వే హోటల్‌లో ఈ సదస్సు జరుగుతుందన్నారు. ఇ న్ఫర్మేషన్ టెక్నాలజీలో వస్తున్న ఆధునిక పోకడ లు, పరిశ్రమలు వీటిని ఏ విధంగా అందిపుచ్చుకుని మంచి ఫలితాలు సాధించాలన్న అంశాన్ని ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించనున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఐటీ నిపుణులు, విద్యావేత్తలు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో పాటు విద్యార్థులను కూడా ఈ సదస్సులో భాగస్వామ్యం చేయనున్నట్టు వెల్లడించారు. ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్, కాగ్నెటివ్ కంప్యూటింగ్, క్లౌ డ్ కంప్యూటింగ్, స్మార్ట్ ఇండస్ట్రీస్ తదితర అంశాలపై నిపుణులతో ప్రత్యేక చర్చ, ప్రసంగాలు ఉం టాయన్నారు. ఎడ్జ్ కంప్యూటింగ్, ప్రాసెస్ ఆటోమేషన్ త్రూ రోబోటిక్స్, ఇండస్ట్రీ 4.0, కాగ్నటివ్ టెక్నాలజీ తదితర అంశాలపై సమీక్షలు ఉంటాయన్నారు. సదస్సులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులతో ప్రత్యేక నివేదిక ఉంటుందన్నారు. సదస్సును రాష్ట్రీ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సీఎండీ పీకే రథ్ ప్రారంభిస్తారని, ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రత్యేక కార్యదర్శి కోన శశిధర్ పాల్గొంటారని, ముగింపు కార్యక్రమానికి విశాఖ పోర్టుట్రస్టు చైర్మన్ పాల్గొంటారన్నారు. సీఎస్‌ఐ విశాఖ చాప్టర్ కార్యదర్శి బీజీ రెడ్డి మాట్లాడు తూ 1965లో ప్రారంభించిన సీఎస్‌ఐ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 రీజియన్లలో 71 చాప్టర్లు కలిగి ఉందన్నారు. సీదస్సులో ఈ సా రి ఐటీ విద్యార్థులకు అవకాశం కల్పించామని తెలిపారు.
*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఐఐ చైర్మన్ కేసీ దాస్