రాష్ట్రీయం

తిరుగువారం రోజున తనివితీరా మొక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి/తాడ్వాయి, ఫిబ్రవరి 12: అమ్మవార్ల తిరుగువారం రోజున తనివితీరా మొక్కులు చెల్లించారు. మేడారం మహాజాతర సందర్భంగా తల్లులను దర్శించుకుని భక్తులు తిరుగువారం మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవార్లు గద్దెలపై ఉన్న సమయంలో నిండుజాతరలో దర్శించుకున్నప్పటికీ మరోసారి అమ్మవార్ల దర్శనానికి వచ్చేందుకు భక్తులు పోటీ పడతారు. బుధవారం తిరుగువారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున అమ్మవార్ల దర్శనానికి వాహనాల్లో తరలివచ్చారు. ముందుగా సమ్మక్క పూజారి అయిన కొక్కెర కృష్ణయ్య, మునీందర్, పూజారులు వేకువ జామునే తలంటు స్నానాలు చేసి కుటుంబ సమేతంగా సమీపంలో ఉన్న సమ్మక్క ఆలయానికి డోలు సన్నాయి వాయిద్యాలతో చేరుకుని ఆలయంలో అమ్మవారి పూజాసామాగ్రి శుద్ధి చేసి, ఆలయంలో ఆడపడచులు మహిళలతో అలికి ముగ్గులు వేసి ముస్తాబు చేశారు. అనంతరం పూజారులు అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, పసుపు, కుంకుమ, బంగారం, మేకపోతును మొక్కి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం చిలకలగుట్టకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కనె్నపల్లిలోని సారలమ్మ ఆలయంలో సారలమ్మ పూజారి కాక సారయ్య, కాక కిరణ్ ఆధ్వర్యంలో పూజారులు వేకువజామునే తలంటు స్నానాలు ఆచరించి నూతన దుస్తులు ధరించి సారలమ్మ గుడికి చేరుకుని అమ్మవారి పూజాసామాగ్రిని శుద్ధి చేసి, మహిళలతో అలికి, ముగ్గులు వేసి ముస్తాబు చేశారు. అమ్మవారికి ప్రీతికరమైన బంగారం, పసుపు, కుంకుమలు, మేకపోతును మొక్కి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అలాగే ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరకు తమ గ్రామాలలో పంటలు సమృద్ధిగా పండాలని, ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవార్లను వేడుకున్నారు. అమ్మవార్ల తిరుగువారం పండుగలో చంద, కొక్కెర, కాక వంటి వంశస్తులు పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పూజారులు సిద్దబోయిన జగ్గారావు, బోజారావు, సురేందర్, వసంతరావు, మునీందర్, కొక్కెర కృష్ణయ్య, దశరథం, స్వామి, బొక్కెన, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.
అమ్మవార్లకు భక్తుల మొక్కులు...
మేడారం మహాజాతర అనంతరం జరిగే తిరుగువారం పండుగ సందర్భంగా బుధవారం సమ్మక్క-సారలమ్మలను భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా జంపన్నవాగు వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివసత్తులతో జంపన్నవాగు మారుమోగింది. అలాగే జంపన్నకు కొబ్బరికాయ, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లలు లేని మహిళలకు సంతానం కలగాలని వాగులో మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఒడి బియ్యంతో సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని పసుపు, కుంకుమ, బంగారం, చీరసారె, పూలు, పండ్లను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ఓ జంట వివాహం చేసుకుని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. తిరుగువారం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడంతో మేడారంలోని ప్రధాన కూడళ్లయిన జంపన్నవాగు, గద్దెల ప్రాంగణంలో భక్తులతో కిటకిటలాడింది. స్థానిక పోలీసులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించారు.
*చిత్రం...గద్దెల వద్ద పూజలు