రాష్ట్రీయం

తెలుగువారంతా క్షేమమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 13: చైనాలోని తెలుగు వారంతా క్షేమంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. జ్వరంతో బాధపడుతూ చైనాలోని వుహాన్ నగరంలో చిక్కుకుపోయిన కర్నూలు జిల్లా నంద్యాల యువతి అనె్నం జ్యోతి విషయమై ఆమె తల్లి ప్రమీలమ్మ, బావ అమర్‌నాథ్‌రెడ్డి ఎంపీ తలారి రంగయ్య, ఎంపీ వంగా గీతతో కలిసి మంత్రిని లోక్‌సభ ఆవరణలోని ఆయన కార్యాలయంలో కలిశారు. చైనాలోని భారతీయులందరినీ తీసుకురావడానికి
తాము సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారని ఎంపీ రంగయ్య తెలిపారు. అయితే అక్కడి పరిస్థితులు అనుకూలించిన మీదట చైనా ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని వెల్లడించారని పేర్కొన్నారు. చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తక్షణం చైనా వెళ్లి భారతీయులను తీసుకురావడానికి విమానాలు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారన్నారు. ప్రత్యేకంగా శిక్షణ కోసం వెళ్లిన అనె్నం జ్యోతి విషయంలో తాము ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నామని, ఆమె ఆరోగ్యంగా ఉందని చైనాలోని భారత అధికారులు తెలిపారని వివరించారన్నారు. భారతీయులంతా కోవిద్ 19 వైరస్ బారిన పడకుండా క్షేమంగా ఉన్నారని, వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారన్నారు. చైనా ప్రభుత్వం అనుమతి కోసం వేచి చూస్తున్నామని, ఏ క్షణాన అనుమతి వస్తే అప్పుడు తీసుకువస్తామని మంత్రి జై శంకర్ హామీ ఇచ్చారని రంగయ్య వివరించారు.
*చిత్రం... విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్‌తో సమావేశమైన ఎంపీలు రంగయ్య, వంగా గీత