రాష్ట్రీయం

సామాన్య భక్తుల చేతిలో శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూ అంటే అది పరపతి, పలుకుబడి, సిఫార్సులు ఉన్నవారికి మాత్రమే సాధ్యమనే మాట నాటిది. అయితే నేడు సామాన్య భక్తులకు సైతం లడ్డూలను విక్రయించే కార్యక్రమానికి తిరుమల అదనపు ఈఓ ధర్మారెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంధ్రనాధ్ సుమారు పదివేల లడ్డూలను తయారుచేయించి సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచారు. ఇందుకోసం 4 కౌంటర్లు కూడా ఏర్పాటుచేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ పెద్ద లడ్డూ విక్రయాలను ప్రారంభించారు. గురువారం ఉదయం 8 గంటల వరకు 614 పెద్ద లడ్డూలను సామాన్యభక్తులు కొనుగోలుచేశారు. గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 5800 పెద్దలడ్డూలు విక్రయించారు. అర్థరాత్రి సమయానికి మరో 3000 లడ్డూలకు పైగా సామాన్యభక్తులకు లడ్డూలు కొనే అవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే రూ.200 విలువచేసే ఈ పెద్దలడ్డూను దళారీలో బహిరంగ మార్కెట్‌లో ఒక్కోలడ్డూను రూ.500విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయంతో సామాన్యులైనా, సంపన్నులైనా దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండానే రూ.200కే లడ్డూ అందుబాటులో ఉంటూండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక సిఫార్సులపైన, ఎల్‌పీటీల ద్వారా గతంలో విక్రయిస్తున్న విధానాన్ని కూడా అమలుచేస్తున్నారు. ఏది ఏమైనా పెద్దలడ్డూకొనాలనే సామాన్యుని కోరికను అధికారులు తీర్చడం ఎంతైనా అభినందనీయమే.
*చిత్రం... టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్‌లో పెద్దలడ్డు కొని ఆనంద పడుతున్న సామాన్యభక్తులు