రాష్ట్రీయం

తెలంగాణ ఎమ్సెట్ షెడ్యూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ , అగ్రికల్చర్ స్ట్రీం తో పాటు ఫార్మసీ, ఫారెస్ట్రీ వంటి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎమ్సెట్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి విడుదల చేశా రు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. జేఎన్‌టీయూహెచ్‌లో
ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన షెడ్యూలు విడుదల చేస్తూ ఎమ్సెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 19న విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఎమ్సెట్ ర్యాంకు ఆధారంగా బీఈ, బీటెక్, బయోటెక్నాలజీ బీటెక్, డయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బి ఫార్మసీ, బిటెక్ ఫుడ్ టెక్నాలజీ, బిఎస్సీ హానర్సు అగ్రికల్చర్, బిఎస్సీ హానర్సు హార్టికల్చర్, బిఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బిఫారెస్ట్రీ సైన్స్, ఫార్మా డీ అడ్మిషన్లను చేపడతామని ఆయన వివరించారు. సెట్ కమిటీ సమావేశం శనివారం నాడు జరిగిందని, షెడ్యూలు ఖరారు చేసిందని చెప్పారు. పరీక్షను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు.
దరఖాస్తులు ఆన్‌లైన్‌లో 21వ తేదీ నుండి స్వీకరిస్తామని, మార్చి 30 వరకూ దరఖాస్తు చేసుకునే వీలుందని చెప్పారు. సమర్పించిన దరఖాస్తుల్లో ఏమైనా లోటుపాట్లుంటే వాటిని మార్చి 31 నుండి ఏప్రిల్ 3వ తేదీలోగా సరిదిద్దుకునే అవకాశం ఉందిన అన్నారు. దరఖాస్తుల సమర్పణ గడువు దాటిన తర్వాత 500 రూపాయిల అపరాధ రుసుంతో ఏప్రిల్ 6వ తేదీ వరకూ, వెయ్యి రూపాయిల జరిమానాతో ఏప్రిల్ 13 వరకూ, 5వేల జరిమానాతో ఏప్రిల్ 20 వరకూ, పది వేల జరిమానాతో ఏప్రిల్ 27వ తేదీ వరకూ దరఖాస్తులను అనుమతిస్తామని చెప్పారు. హాల్‌టిక్కెట్లను ఏప్రిల్ 20 నుండి మే 1వ తేదీ వరకూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఇంజనీరింగ్ స్ట్రీం పరీక్ష ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, అలాగే సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకూ జరుగుతుందని చెప్పారు. ఇంజనీరింగ్ స్ట్రీం పరీక్షను మే 4,5,7 తేదీల్లో ఉదయం , సాయంత్రం ఆరు షిఫ్టుల్లో నిర్వహిస్తామని, అలాగే అగ్రికల్చర్ స్ట్రీం పరీక్షను మే 9, 11 తేదీల్లో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్, ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మన్జూర్ హుస్సేన్ , మండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ వీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ ఫీజులు
ఇంజనీరింగ్ స్ట్రీం పరీక్షకు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు 400 రూపాయిలు, ఇతరులకు 800 రూపాయిలు, అగ్రికల్చర్ స్ట్రీం పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్ధులకు 400 రూపాయిలు, ఇతరులకు 800 రూపాయిలు, రెండు పరీక్షలు రాసేవారికి ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్ధులకు 800 రూపాయిలు, ఇతరులకు 1600 రూపాయిలు నిర్ధారించినట్టు చెప్పారు.
పరీక్ష కేంద్రాలు
ఆబిడ్స్, నాచారం వౌలాలీ, సికింద్రాబాద్ ప్రాంతాలను హైదరాబాద్ సెంట్రల్ జోన్‌గా, అంషాపూర్, బోడుప్పల్, చెర్లపల్లి, ఘటకేశ్వర్, కీసర, కొర్రెముల, ఉప్పల్ డిపో ప్రాంతాలను హైదరాబాద్ ఈస్టుగా, దుండిగల్, మైసమ్మగూడ, మేడ్చెల్, ఓల్డు అల్వాల్‌లను హైదరాబాద్ నార్త్‌గా, హయత్‌నగర్, నాగోలు, ఇబ్రహీంపట్నం, ఖర్మన్‌ఘాట్, ఎల్‌బీ నగర్, నాదర్‌గూల్, శంషాబాద్, రామోజీ ఫిల్మ్‌సిటీలను హైదరాబాద్ సౌత్‌ఈస్టుగా విభజించామని అలాగే హఫీజ్‌పేట, హిమాయత్‌సాగర్, బాచుపల్లి, కూకట్‌పల్లి, గండిపేట, షేక్‌పేట, మొయినాబాద్‌లను హైదరాబాద్ వెస్టుగా ఐదు జోన్లు చేశామని ఆయన వివరించారు.దానివల్ల అభ్యర్ధులు వారు నివాసానికి సమీపంలోనే పరీక్ష రాసేందుకు వీలుకలుగుతుందని పాపిరెడ్డి వివరించారు. ఇక తెలంగాణలో నల్గొండ, కోదాడ, ఖమ్మం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట, 55 ప్రముఖ పట్టణాలకు 20 రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు.
*చిత్రం... షెడ్యూల్ వివరాలు వెల్లడిస్తున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి