రాష్ట్రీయం

వివాదస్పదమవుతున్న ఈవీడీఎం జరిమానాల విధింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మహానగర పాలక సంస్థలోని ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విధిస్తున్న జరిమానాల విధింపులు వివాదాస్పదమవుతున్నాయి. మెహిదీపట్నంలో ఓ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు భోధించే సంస్థకు ఏకంగా రూ. 33లక్షలు, ఎల్‌బీనగర్‌లో ఓ చిరువ్యాపారికి రూ.25వేలు, ఇంటి మరమ్మతుల కోసం ఆరుబయట మూడువేల రూపాయల విలువైన ఇటుకలు వేస్తే రూ.25వేల జరిమానా విధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అధికారులు సీఎం కేసీఆర్ బర్త్‌డేకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ జలవిహార్‌లో భారీ సైజులో ఏర్పాటు చేసిన కటౌట్‌కు కేవలం ఐదు వేల రూపాయల జరిమానా విధించి, తమ ప్రతాపాన్ని చాటుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ సైజులో కటౌట్, ఇతర ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన మంత్రి ఎంత ఫైన్ విధించినా, చెల్లించే స్తోమత ఉన్నా, నామమాత్రంగా విధించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక చెల్లించలేని స్తోమత ఉన్న వారిపై వేలు, లక్షల్లో జరిమానాలు విధించి, దాన్ని ఎప్పటికపుడు రెండింతలు చేయటం ఏ చట్టంలో ఉందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కేవలం మూడు వేల రూపాయల విలువ చేసే ఇటుకలకు ఏకంగా రూ.25వేల జరిమానా ఏ ప్రామాణికంగా విధించారు? మంత్రి ఏర్పాటు చేసిన భారీ సైజు కటౌట్‌కు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నింటికి కలిపి ఏ పారా మీటర్ ప్రకారం కేవలం ఐదు వేల జరిమానా విధించారో ఈవీడీఎం అధికారులు సమాధానం చెప్పాలన్న డిమాండ్‌లు విన్పిస్తున్నాయి. రోడ్లపై చెత్తాచెదారం, భవన నిర్మాణ వ్యర్థాలు వేయటంతో పాటు బహిరంగ మల,మూత్ర విసర్జన చేసినా, జరిమానాలు వేయవచ్చునని నిబంధనలున్నా, ఇంత భారీ స్థాయిలో జరిమానాలు విధించటం దేశంలో ఏ మున్సిపల్ యాక్టులో లేదని ప్రజాప్రతినిధులే చెబుతున్నారు.