రాష్ట్రీయం

ఉగ్ర చర్యలకు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, ఫిబ్రవరి 16: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐదున్నర ఏళ్ల పాలనలో ఉగ్రవాద చర్యలకు పూర్తిగా అడ్డుకట్ట వేశామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గతనెల 12న జరిగిన విధ్వంస ఘటనలో సర్వం కోల్పోయిన బాధితులను ఆయన ఆదివారం పరామర్శించి వారితో మాట్లాడారు. మోదీ పాలనలో ఏ రాష్ట్రంలో కూడా బాంబు పేలుళ్లు, ఉగ్రవాద చర్యలు చోటుచేసుకోలేదని ఆయన అన్నారు. భారత దేశంలో ప్రతి పౌరుడికి పూర్తి స్థాయి రక్షణను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. భైంసా పట్టణంలోని కొర్వగల్లీలో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమైందని ఆయన అన్నారు. భైంసా బాధితులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అండదండలు అందిస్తుందని పేర్కొన్నారు.
భైంసా పట్టణంలోని కొర్వగల్లీలో బాధితులను పరామర్శించిన అనంతరం ప్రభుత్వం విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఘటన చోటుచేసుకున్న రాత్రి ఢిల్లీ నుండి తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, తమ పార్టీ స్థానిక అధ్యక్షురాలితో అనుక్షణం మాట్లాడినట్టు ఆయన తెలిపారు. ఈ ఘటన పథకం ప్రకారం జరిగినట్టు కనిపిస్తోందని, కుట్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విధ్వంస ఘటనలో సర్వం కోల్పోయిన బాధితులకు తక్షణమే సహాయ చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు కోల్పోయిన ధ్రువీకరణ పత్రాలు, ఇతరత్రా పత్రాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డు వంటి అధికారులు తక్షణమే అందజేయాలని ఆదేశించారు. ఈ ఘటనలో సర్వం కోల్పోయిన బాధితులకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ 5 లక్షల విరాళంతో పాటు తన ఆరు నెలల వేతనాన్ని కొర్వగల్లీ బాధితులకు అందిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ ఘటనలో పోలీసులకు సైతం గాయాలు కావడం దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. స్థానికంగా బాధితులకు భరోసా కల్పించేందుకు పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉండాలని తెలిపారు. బాధితులకు సహాయ చర్యలు అందించేందుకు ఇప్పటికే
యంత్రాంగం 2.33 కోట్ల రూపాయలు ప్రణాళికలు సిద్ధం చేసినందున, వాటితో పాటు అధిక నిధులు మంజూరు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. కుట్రలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అమాయకులపై కేసులు కాకుండా చూడాలని అన్నారు. ఇలాంటి సంఘటన చోటుచేసుకున్నప్పటికీ భైంసా పట్టణంలో 8 మంది బీజేపీ, ఇద్దరిని ఇండిపెండెంట్‌గా గెలిపించినందుకు పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్ట్లు ఆయన తెలిపారు. భైంసా పట్టణ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్‌లు, న్యాయవాదులు, కొర్వగల్లీ బాధిత సంఘం ప్రతినిధులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాలు అందజేశారు. ఈ విలేఖరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాపురావు, రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్‌రావు, రామచందర్‌రావు, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, నర్సింహులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రమాదేవితో పాటు పలువురు పాల్గొన్నారు.

*చిత్రం... కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు