రాష్ట్రీయం

వైభవంగా గౌతమ్‌కుమార్ జైన సన్యాస దీక్షాధారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ముముక్షు గౌతమ్‌కుమార్ సన్యాస దీక్షాధారణ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక త్యాగరాయ కళా క్షేత్రంలో జైన మునులు, మతగురువులు శాస్త్రోక్తంగా రాజమహేంద్రవరంలో తొలిసారి జైనమత సన్యాస దీక్షాధారణ క్రతువును నిర్వహించారు. ముముక్షు గౌతమ్‌కుమార్ సన్యాస దీక్ష స్వీకరించడంతో నూతన జైన మునిగా మార్పుచెందారు. సన్యాసం స్వీకరించిన తర్వాత నూతన జైన మునిగా కొద్దిసేపు ఆయనను సంభోధించినప్పటికీ ఆ తర్వాత మునిరాజ్ శ్రీజిన్‌రుచి విజయ్‌జీ మహారాజ్ సాహెబ్‌గా గురువు జినసుందర సురీశ్వరజీ మహారాజ్ సాహెబ్ నామకరణం చేశారు. సన్యాస స్వీకారానికి ముందు రోజు శనివారం రాత్రి విజయసమారో కార్యక్రమం నిర్వహించారు. గురువు సమక్షంలో ముముక్షు గౌతమ్‌కుమార్ తల్లిదండ్రులు శారదాదేవి, దిలీప్‌కుమార్ జైన్‌లు తమ కుమారిడి తలపై తలంబ్రాలు పోశారు. గౌతమ్‌కుమార్ కూడా తన తల్లిదండ్రుల తలపై తలంబ్రాలు పోశారు. ధర్మ ప్రచారంపై తాను ప్రభావితం కావడంతో పాటుగా తనకు సహకరించిన హితేష్‌కుమార్ జైన్, ముఖేష్‌కుమార్ జైన్‌లను ముముక్షు గౌతమ్‌కుమార్ పిలిచి గురువుకు వారి గురించి తెలియజేశారు. వారి తలపై కూడా తలంబ్రాలు పోశారు. ముముక్షు గౌతమ్‌కుమార్‌పై హితేష్‌కుమార్, ముఖేష్‌లు తలంబ్రాలు పోశారు. కుటుంబ బంధనాలను పూర్తిగా వదులుకుని సన్యాసం స్వీకరించేందుకు స్థానిక పప్పుల వారి వీధిలోని ముముక్షు గౌతమ్‌కుమార్ ఇంటి నుంచి పల్లకిపై ఊరేగింపుగా త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణానికి వచ్చారు. ముందుగా గురువుకు, తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. సన్యాసం స్వీకరించడానికి మనస్ఫూర్తిగా తాను వచ్చానని ముముక్షు గౌతమ్‌కుమార్ గురువుకు తెలియజేశారు. మహావీర్ విగ్రహానికి చివరి సారిగా పూజలు చేశారు. సన్యాసం స్వీకరించిన తర్వాత విగ్రహారాధన, బొట్టు పెట్టుకోవడం వంటివి ఎప్పటికీ చేయరు. చివరి సారిగా అంతిమ తిలకాన్ని షా వస్తిమల్ సిరేమల్‌జీ కుటుంబం ముముక్షు గౌతమ్‌కుమార్ నుదుట దిద్దారు. అనంతరం సన్యాసం స్వీకరించే ప్రక్రియను మొదలు పెట్టారు. ముందుగా గౌతమ్‌కుమార్ శిరోజాలను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. శిరోజాలను ఒక్కొక్కటిగా తొలగించి ఆ తర్వాత దీక్షా వస్త్రాలను ధరింపజేశారు. మంగళ వాయిద్యాల నడుమ దీక్షా వస్త్రాలతో సభావేదికపైకి తీసుకొచ్చారు.
గురువు ఎదురేగి ఆలింగనం చేసుకున్నారు. అప్పటి నుంచి గౌతమ్‌కుమార్ నూతన జైన మునిగా మారారు. నూతన దీక్షిత్‌గా కొద్దిసేపు సంభోధించారు. నూతన జైనముని పేరును మునిరాజ్ శ్రీజిన్‌రుచి విజయ్‌జీ మహారాజ్ సాహెబ్‌గా గురువు నామకరణం చేశారు.
*చిత్రం...జైన గురువు జినసుందర సురీశ్వరజీ మహరాజ్ సాహెబ్‌తో సన్యాస దీక్ష స్వీకరించిన గౌతమ్ కుమార్