రాష్ట్రీయం

ఆది దంపతులకు రావణ వాహనసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 18: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీగిరిపై మంగళవారం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి వార్లు రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంపై ఆశీనులను జేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం హారతుల అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధాన వీధుల్లో కన్నులపండువగా జరిగిన గ్రామోత్సవాన్ని భక్తులు తిలకించి పునీతులయ్యారు. గ్రామోత్సవం ముందుభాగంలో కోలాటం, చెక్క్భజనలు, రాజుభటుల వేషాలు, పగటి వేషాలు, బుట్ట బొమ్మలు, గొరవయ్యల నృత్యాలు తదితర కళారూపాలు ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.