రాష్ట్రీయం

వారాలు గడిచినా రైతులకు సొమ్ము చెల్లించరేం?: పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం వారాలు గడిచినా చెల్లించలేదేమని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుల సంక్షేమం, భరోసా అంటూ ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరిస్తున్నారన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు 2,016 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉందన్నారు. లక్ష మందికి పైగా రైతులు ధాన్యం అమ్మిన డబ్బుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారన్నారు. రెండవ పంటకు అవసరమైన పెట్టుబడులు లేక రైతాంగం ఇబ్బందులు పడుతుంటే సంబంధిత శాఖలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. రైతులకు ప్రభుత్వం ఎప్పుడు సొమ్ము చెల్లిస్తుందో చెప్పాలన్నారు. అమ్మిన పంటకు రావాల్సిన డబ్బులపై అడుగుతున్న రైతులకు ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం సైతం రాకపోవడం పాలకుల బాధ్యతా రాహిత్యాన్ని తెలియజేస్తోందన్నారు. ధాన్యం అమ్మిన నెల రోజులకు కూడా సొమ్ము చేతికి రాక, రెండవ పంటకు పెట్టుబడి లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. ఖరీఫ్ పంట కొనుగోలు, సొమ్ము చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ప్రణాళిక లేకుండా ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో గత డిసెంటర్‌లో రైతు సౌభాగ్య దీక్ష ద్వారా వెల్లడించామన్నారు. ధాన్యం కొనుగోలు కోసం నిదులు కేటాయించారా, కేటాయిస్తే ఆ నిధులు ఎటు వెళ్లాయో రైతాంగానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.

*చిత్రం... జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్