రాష్ట్రీయం

వేములవాడకు హెలికాప్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడకు హెలికాప్టర్ సౌకర్యాన్ని ప్రారంభించింది. తెలంగాణ స్టేట్ ఏవియేషన్ కార్పొరేషన్ సహకారంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెలికాప్టర్ సర్వీసులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ బేగంపేట్ విమానాశ్రయంలో గురువారం ప్రారంభించారు. ఈ విమాన సర్వీసులు ఈనెల 23 వరకు అందుబాటులో ఉంటాయి. హెలికాప్టర్ సేవలకు సంబంధించి ధరలకు మూడు ప్యాకేజీలు ప్రకటించారు. ప్యాకేజీ-1లో వేములవాడ నుంచి వ్యూ పాయింట్‌కు ఏడు నిమిషాల రైడ్‌కు టికెట్ ధర రూ. 3వేలు, ప్యాకేజీ-2లో వేములవాడ మిడ్‌మానేరు పరిసర ప్రాంతాలను చూసేందుకు రూ. 5.500. కనీసం ఆరుగురు వ్యక్తులుండాలి. 16 నిమిషాల విహంగ వీక్షణం. ఇక ప్యాకేజీ-3లో హైదరబాద్ నుంచి వేములవాడకు, తిరిగి హైదరాబాద్‌కు టికెట్ ధర రూ. 30 వేలు. కనీసం ఐదుగురు వ్యక్తులుండాలి. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధానాలయాలు, పర్యాటక ప్రాంతాలకు హెలికాప్టర్ సేవలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిడ్‌మానేరు నుంచి సిరిసిల్లకు బోటు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ నుంచి వేములవాడకు పర్యాటక ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.