రాష్ట్రీయం

రాజన్నకు ప్రణమిల్లిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, ఫిబ్రవరి 20: దక్షిణకాశీగా పేరుగాంచిన శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అనుగుణంగా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లను సైతం పూర్తి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే భక్తుల పాలిట కొంగుబంగారమై రాజన్నను దర్శించుకుని, జాగరణ చేయడానికి ఇక్కడికి భక్తులు తరలివస్తున్నారు. ఇప్పుడు అన్నిదారులూ వేములవాడ శైవక్షేత్రం వైపే అన్నట్టుగా భక్తులు ప్రవాహం ప్రారంభమైంది. జిల్లాకు పశ్చిమ ప్రాంతమైన కోరుట్ల, నిజామాబాద్, ఆర్మూర్, బీంగల్ ప్రాంతాల నుండి తమ ఇలవేల్పయన రాజన్నపై సన్నిధానానికి చేరుకుంటున్నారు. నెత్తిమీద ముల్లెలతో, పిల్లాపాపలు, వృద్ధులు అనే తేడాలేకుండా రాజన్న దర్శనానికి వస్తున్నారు. పవిత్ర ధర్మగుండంలో స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటారు. గురువారం శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని 20 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నాక స్వామివారి సేవలో తరించారు. ముందుగా ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని నిలువెత్తు బెల్లాన్ని భక్తులకు పంపిణీ చేశారు.
*చిత్రం... రాజన్న క్షేత్రానికి చేరుకుంటున్న భక్తులు