రాష్ట్రీయం

ఉద్యోగం ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యుత్ సంస్థల ఉద్యోగుల విభజన వివాదంపై జస్టిస్ ధర్మాధికారి ఆదివారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న మీదట దీనిపై ప్రాథమిక నివేదికను వారం రోజుల్లో ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇదే చివరి సమావేశం అంటూ ఏక సభ్య కమిటీ ధర్మాధికారి స్పష్టం చేయడంతో విద్యుత్ ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల సీఎండీలు, ఉద్యోగ సంఘాల నేతలు ఢిల్లీలో మకాం వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చివరిసారిగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఏక సభ్య కమిటీ ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల యాజమాన్యానికి సమాచారం పంపింది. ఏక సభ్య కమిటీ ముందు మరోసారి తమ వాదనలను గట్టిగా వినిపించడానికి ఇరు రాష్ట్రాల విద్యుత్ అధికారులు, సీఎండీలు సిద్ధయ్యారు. తెలంగాణ నుంచి రాష్టస్థ్రాయి అధికారులైన 655 మందిని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రాకు బదిలీ కావడాన్ని ఏపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ నుంచి 655 మంది ఏపీకి ఉద్యోగులు బదిలీ అయితే
రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని ఏపీ వాదించింది. మరోవైపు తెలంగాణ నుంచి తమ వాదనలను ఏకసభ్య కమిటీ ముందుకు తీసుకువచ్చింది. ఏపీకి బదిలీ అయిన 655 మంది ఉద్యోగులను తెలంగాణలో చేర్చుకునే ప్రసక్తే లేదని విద్యుత్ సంస్థల అధికారులతో పాటు సీఎండీలు తెగేసి చెప్పారు. దీంతో ఏక సభ్యకమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇరు వర్గాల్లో ఆతృత నెలకొంది. ఏపీ కూడా న్యాయపరమైన అంశాలను ఏక సభ్యకమిటీ ముందు ఉంచింది. ఏపీ నుంచి ట్రాన్స్‌కో, జెన్‌కో జెఎండీ చక్రధర్‌బాబుతో పాటు సీనియర్ అడ్వకేట్ పునీత్ ఏపీ అభ్యంతరాలను ఏకసభ్యకమిటీ దృష్టికి తీసుకువచ్చారు. వాదోపవాదాల అనంతరం జస్టిస్ ధర్మాధికారి మాట్లాడుతూ నిర్ణయంపై వారం రోజుల్లో ప్రాథమిక నివేదిక అందజేయనున్నటుల స్పష్టంచేశారు. దీంతో ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలతో పాటు ఉద్యోగ సంఘాల నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో 6,120 మంది విద్యుత్ ఉద్యోగుల్లో ఇరు రాష్ట్రాలు నిష్పత్తి ప్రకారం విభజన జరగలేదని ఏపీ వాదిస్తోంది. బదిలీ అయిన 655 మందిని ఏవిధంగా విభజిస్తారని ధర్మాధికారి ముందు ఏపీ గట్టిగా పట్టుబట్టింది. 2020 సంవత్సరం జనవరి 5వ తేదీన తెలంగాణ నుంచి బదిలీ అయిన ఉద్యోగుల జీతాలు ఏపీ ప్రభుత్వం భరించే స్థితిలో లేదని ఏపీ వాదిస్తోంది. తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీలు దేవులపల్లి ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డి, గోపాల్‌రావు, రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా ఏకసభ్య కమిటీ ముందు హాజరు అయ్యారు.