రాష్ట్రీయం

2030 నాటికి పెట్రోల్ బంకులుండవ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: ప్రపంచ దేశాలన్నింటినీ నేడు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వనరుల సమస్య ఇబ్బందులకు గురిచేస్తోంది. మన దేశంలో వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏటా రోడ్ల మీదకు వస్తున్న వాహనాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూపోతోంది. దీంతో వాటికి అనుగుణంగా ఇంధనం సరఫరా చేయడం కష్టంగా మారుతోంది.
అందుకే వాటి ధరలు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అంతేకాకుండా పెరుగుతున్న వాహనాల సంఖ్యతో పాటు కాలుష్యం సమస్య కూడా తీవ్రవౌతోంది. ఢిల్లీలో కాలుష్యం తీవ్రత తారస్థాయికి చేరడంతో అక్కడ వాహనాలకు సరి, బేసి సంఖ్యల వంటి రూల్స్ పెట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇకపై కాలుష్యం సమస్యే కాదు, మనకు పెట్రోల్, డీజిల్ కొనాల్సిన పనికూడా ఉండదంటున్నారు నిపుణులు. 2030 నాటికి దేశంలో విద్యుత్‌తో నడిచే వాహనాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. దీంతో ఇక పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలను పూర్తిగా రోడ్ల పైకి రాకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే కంపెనీలకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చేందుకు కూడా సిద్ధవౌతోంది. నిజంగా ఇది జరిగితే ఇక పెట్రోల్, డీజిల్ బంకులు అన్నీ మూతపడడం ఖాయం. వాటిస్థానంలో వాహనాలను చార్జింగ్ చేసే స్టేషన్లు వస్తాయి. అప్పుడు ఎంచక్కా తక్కువ ఖర్చుతోనే వాహనాలను చార్జింగ్ పెట్టుకోవచ్చంటున్నారు. దీంతో పెద్దఎత్తున రవాణా ఖర్చులే కాకుండా అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నారు. సాధారణ ప్రజలకు పెట్రోల్, డీజిల్ భారం ఉండదు. అవి లేకపోతే కాలుష్యం కూడా తగ్గుతుంది. ఫలితంగా పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యవౌతుందని నిపుణులు పేర్కొంటున్నారు.