రాష్ట్రీయం

నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 24: తనపై వచ్చిన అసత్య ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, కొంతమంది పైశాచిక క్రీడతో ఎదురైన అనుభవాలతో మానసిక క్షోభకు గురై నేడు తిరుమలకు వచ్చానని, భగవంతుడికి అన్నీ తెలుసని టీటీడీ ఎస్వీబీసీ మాజీ చైర్మన్, ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్ అన్నారు. మహిళతో ఫోన్‌లో అసభ్యంగా సంభాషించిన ఆరోపణలతో ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన తరువాత తొలిసారిగా శ్రీవారి దర్శనానికై పృథ్వీరాజ్ తిరుమలకు వచ్చారు. సోమవారం ఉదయం విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదని, త్వరలోనే అన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. తన నిజాయితీ నిరూపించుకోవడం కోసం ఏడాదిపాటు రక్త నమూనాలను పరీక్షలు చేయించానని, వాటిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి త్వరలో అందజేస్తానన్నారు. తనపై శారీరకంగా దాడి చేసి ఉన్నా బాధపడేవాడిని కాదని తన కడుపుపై కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీబీసీలో బాగా పనిచేయండని సీ ఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరికీ మేలు జరుగుతుందని తాను గట్టిగా చెప్పడమే నేరమైందన్నారు. ఐదు నెలల్లోనే 50 సంవత్సరాల కాలంలో ఎదురయ్యే సమస్యలను ఎస్వీబీసీ సిబ్బంది చేశారని ఆరోపించారు. తనకు లౌక్యం తెలియదన్నారు. అందుకే ఎస్వీబీసీ ఉద్యోగులు తనకు మంచి బహుమతి ఇచ్చారని అన్నారు. ఎస్వీబీసీలో కొందరు ఉద్యోగులు వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడిచారని, తనను రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది ఇలా ఇరికించి పైశాచిక ఆనందం పొందుతున్నారని, వారికి వెంకన్న తగిన గుణపాఠం చెబుతాడన్నారు. ఒక చానల్ సీఈఓ తనను బూతులు తిట్టాడని, ఆయనకు తనపై ఎందుకంత కసో అర్థం కావడం లేదన్నారు. 11 సంవత్సరాలపాటు వైసీపీలో కష్టపడి పనిచేశానని అందుకు తన గురువు విజయసాయి రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఎస్వీబీసీ చైర్మన్ పదవిని ఇచ్చారన్నారు. స్వామివారికి సేవ చేద్దామని వచ్చిన తనను కొంతమంది ఇలా భ్రష్టుపట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన తరువాత తన ఇంటిలో మొక్కలకు నీరు పడుతూ కళ్లు తిరిగి పడిపోయానని దీంతో కుడి చెయ్యి కూడా విరిగిందన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో వెంటనే తన పదవికి రాజీనామ చేసానే తప్ప తనపై ఎవరూ ఒత్తిడి చేసి రాజీనామా చేయించలేదన్నారు. తనకు న్యాయ స్థానంపై పరిపూర్ణమైన నమ్మకం ఉందని, తనను విచారించిన విజిలెన్స్ సిబ్బంది కూడా తన ప్రవర్తన పట్ల చెప్పిన మాటలు తృప్తిని ఇచ్చాయన్నారు. తిరిగి ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారా అన్న ప్రశ్నకు అది వెంకన్న ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి పెద్దల ఆశీస్సులు ఉంటే ఏమైన జరగచ్చన్నారు. అమరావతిలో పేద రైతుల గురించి వ్యాఖ్యలు చేయలేదన్నారు. రైతుల ముసుగులో ఉన్న కార్పొరేట్ వ్యాపారులపై వ్యాఖ్యలు చేశానన్నారు. కర్ణుడి చావుకు శతకోటి శాపాలన్నట్లుగా తన విషయంలోను అదే జరిగిందన్నారు. యాక్సిడెంట్ సృష్టించారని ఆ ప్రమాదానికి తాను భయపడలేదన్నారు. తాను చనిపోయినా కూడా తనకు సంబంధించి సమాచారం చానల్స్‌లో ఎక్కువ సమయం కేటాయించి ప్రసారాలు చేస్తారని అనుకోవడంలేదని, అయితే తనపై వచ్చిన అసత్య ఆరోపణలను మాత్రం రెండు రోజులపాటు క్షణం వృథా చేయకుండా ప్రసారాలు చేసి ఒక అసత్యాన్ని నిజం చేయాలని చూడటం బాధగా ఉందన్నారు. తన చివరి ఊపిరి వరకు వైకాపాలోనే కొనసాగుతానని, ఆ జెండానే మోస్తానన్నారు. తాను ఎస్వీబీసీ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, అదనపు ఈ ఓ ధర్మారెడ్డి, ఈ ఓ సింఘాల్ ఇతర అధికారులు ఎంతగానో సహకరించారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. తాను ప్రస్తుతం చిరంజీవి సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు. ఈ ఐదు సంవత్సరాల్లో అనేక సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నానన్నారు. తనకు జీవితాన్ని ఇచ్చిన చిత్రపరిశ్రమ గురించి ఏనాడు తప్పుగా మాట్లాడలేదని సిద్ధాంతపరంగా వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.