రాష్ట్రీయం

యాదాద్రీశుడికి బ్రహ్మోత్సవ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 25: స్తంభోద్భవుడు లక్ష్మీనరసింహుడు కొలువైన యాదాద్రి పుణ్య క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. తెలంగాణ తిరుపతి యాదాద్రిలో ఫాల్గుణ శుద్ధ తదియ నుండి ఫాల్గుణ శుద్ధ త్రయోదశి వరకు నిర్వహించే లక్ష్మినరసింహుడి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు సవాహ్నిక దీక్షతో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం ఈ నెల 26 నుం డి మార్చి 7 వరకు 11రోజులు అత్యంత వైభవోపేతంగా సాగనున్నాయి. లోక కల్యాణం, విశ్వశాంతిలను కాంక్షిస్తు ముక్కోటి దేవతలు, భక్తజనం ఆహుతులుగా అంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మండనాయకుడి బ్రహ్మోత్సవ పర్వం విశేష అలంకార సేవలు, వాహన సేవలు, తిరుకల్యాణోత్సవాలతో కొనసాగనున్నాయి. 26న ఉదయం 10గంటలకు విశ్వక్సేనారాధన, స్వస్తివాఛనంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన లక్ష్మీనరసింహుల తిరు కల్యాణోత్సవం మార్చి 4న ఫాల్గుణ శుద్ధ నవమి రోజున ఉదయం 11గంటలకు బాల ఆలయంలో నిర్వహించనున్నారు. స్వామివారి ప్రధానాలయం పునర్ నిర్మాణ పనుల కారణంగా బాల ఆలయంలో తిరు కల్యాణం, రాత్రి 8గంటలకు కొండ దిగువన జడ్పీ ఉన్నత పాఠశాలలో వైభవోత్సవ కల్యాణం కన్ను ల పండువగా నిర్వహించేందుకు దేవస్థానం, అర్చక, వేద పం డిత బృందం సన్నద్ధమైంది. ఆలయ ఈవో గీతారెడ్డి, అనువంశి క ధర్మకర్త బి.నరసింహమూర్తిలు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా ప్రధానార్చకులు నంధీగల్ నరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, యాజ్ఞిక బృందం బ్రహ్మోత్సవ ఘట్టాలను నిర్వహించనున్నారు. మార్చి 7న శతఘాటాభిషేకం, శృంగార డోలోత్సవం, చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా నిలిచే స్వామివారి విశేషాలంకార, వాహన సేవలు, ధార్మిక, సంగీత, సాహిత్య మహాసభలు భక్తులను అలరించనున్నాయి.
బ్రహ్మ నుండి నేటి దాకా..!
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు, జగత్ రక్షకుడైన లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు చతుర్ముఖుడు, సృష్టికర్తయైన బ్రహ్మోదేవుడే స్వయాన ఆరంభించడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధినొందాయి. బ్రహ్మోత్సవాలు, స్వామివారి కల్యాణోత్సవ ఘట్టాన్ని వీక్షించేందుకు ముక్కోటి దేవతలు భూలోకానికి తరలివస్తారని భక్తులు నమ్ముతారు. దేవతలు, సురులు, మునులు, అళ్వార్‌లు, భక్తజనుల సమక్షంలో సాగే లక్ష్మీనరసింహుల తిరు కల్యాణోత్సవ ఘట్టంతో లోకకల్యాణం, ప్రజలకు సుఖశాంతులు చేకూరుతాయి.
మహిమాన్వితం యాదాద్రి క్షేత్రం
స్క్పాంధ, నరసింహ పురణాల మేరకు కృతాయుగంలో హిరణ్యకశ్యప వధ అనంతరం ఉగ్రనరసింహ అవతారంలో భీతిగొల్పుతున్న లక్ష్మీనరసింహుడిని ఎల్లవేళల ప్రసన్న రూపంలో దర్శనమివ్వమని ప్రహ్లాద సహిత దేవతలు ప్రార్ధిస్తారు. రాక్షస వధ జరిగిన చోట ప్రసన్న దర్శనం భావ్యం కాదంటు దక్షిణ భారతన కొండపైన గుహలో లక్ష్మీసహితంగా వెలసి జ్ఞాననేత్రాలతో దర్శమిస్తానని చెప్పి యాదాద్రిలో నరసింహుడు ప్రసన్ననేత్రాలతో వెలియగా బ్రహ్మాది దేవతలు వారిని పూజించి ఆరాధిస్తున్నారు. త్రేతాయుగంలో విభాండక మహర్షి తనయుడు ఋష్యశృంగుడి పుత్రుడైన యాదరుషి శ్రీ మహావిష్ణువు హిరణ్యకశపుడిని వధించిన ఉగ్ర నరసింహుడి రూపంలో దర్శనం కోరుతు అనే్వషణకు బయలుదేరుతాడు. అడవుల్లో కొండజాతికి చిక్కి ప్రాణాపాయంలో ఉన్న యాదరుషిని క్షేత్ర పాలకుడు ఆంజనేయుడు రక్షించి యాదాద్రి కొండపై స్వామివారి సాక్షాత్కారానికి తపస్సు చేయమంటు సూచిస్తాడు. యాదరుషి ఘోర తపస్సుకు మెచ్చిన నరసింహుడు జ్వాల (జ్యోతి) రూపంలో ప్రత్యక్షమవుతాడు. అతడి కోరిక మేరకు పంచ నరసింహ రూపాలైన ఉగ్ర నరసింహా, జ్వాల, యోగానంద, గంఢభేరుండ, లక్ష్మీనరసింహులుగా స్వామిదర్శనమిస్తాడు. కొండపైన గుహలో జ్వాల, యోగానంధ, గంఢభేరుం డ, లక్ష్మీనరసింహులుగా కొలువై భక్తులకు దర్శనమిస్తు కొండ చుట్టు ఉగ్ర నరసింహుడిగా ఆవహించి భక్తులను పరిరక్షిస్తుంటాడని ప్రసిద్ధి. స్వామి తన ఆయుధం సుదర్శన చక్రాన్ని భక్తు ల రక్షణకు ఇక్కడ నియమించాడని క్షేత్ర పురాణం. పంఛ నరసింహాలు ఆర్చామూర్తిగా ఏకశిలపై వెలసిన యాదాద్రి క్షేత్రం పంచ నారసింహ క్షేత్రంగా భక్తుల పూజలందుకుంటుండగా క్షేత్ర పాలకుడిగా ప్రసన్నాంజనేయుడు పూజలందుకుంటున్నా రు. కొండపై యాదరుషి స్వామి పాదాలు కడిగిన జలంతో ఏర్పడిన విష్ణుపుష్కరణి భక్తుల పుణ్యస్నానాలకు వేదికైంది. యాదాద్రిలో ప్రతి రోజు రాత్రి సుర, మునులు స్వామివారిని సేవిస్తారని భక్తుల నమ్మిక. యాదరుషి తపోఫలంగా ఈ కొండ యాదగిరిగుట్టగా ప్రసిద్ధినొందింది. కృతాయుగం నుండి సురు లు, మునులు, రాజాధిరాజులు సేవించిన యాదాద్రి లక్ష్మీనరసింహుడి దర్శనంతోనే సకల కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మహాదేవుడు శివుడు సైతం ఈ క్షేత్రంపై శ్రీ పర్వతవర్ధిని సహిత రామలింగేళ్వరుడిగా కొలువై ఉండటంతో శివకేశవుల పుణ్యస్థలిగా సైతం యాదాద్రి విరాజిల్లుతుంది.
లక్ష్మీనరసింహుడిని కొలిచిన పాలకులు..
లోకపాలకుడైన యాదాద్రి లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వాల తరుపునా ముఖ్యమంత్రులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం క్షేత్ర ఔన్నత్యాన్ని, కల్యాణ విశిష్టతను చాటుతుంది. క్రీ.శ.1148లో పశ్చిమ చాళుక్య రాజు త్రిభువన మల్లుడు భువనగిరి కోట కేంద్రంగా రాజ్యపాలన సాగిస్తు పంఛనారసింహుడిని సేవించారు. 13,15వ శతాబ్ధాల్లో కాకతీయులు, కృష్ణదేవరాయలు స్వామివారిని దర్శించుకున్నట్లుగా కొలనుపాక జగద్ధేవ నారాయణ ఆలయ శాసన ప్రసిద్ధి. నైజాం ప్రభుత్వం నుండే ధర్మకర్తల మండలి కొనసాగుతుంది.
మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా యాదాద్రి లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందించే సాంప్రదాయం ఆరంభించారు. ఎన్‌టీ రామారావు దంపతులు సైతం 1994లో ముఖ్యమంత్రి హోదాలో పట్టువసాస్తల్రను అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపునా సీఎం కేసీఆర్ సైతం కల్యాణోత్సవానికి హాజరై పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందించే అధికారిక అనవాయితీ ప్రారంభించి కొనసాగిస్తున్నారు. ప్రముఖులెందరో లక్ష్మీనరసింహుడిని సేవించగా 1956జూలైలో భారత తొలి రాష్టప్రతి డాక్టర్ రాజేంద్రప్రసాద్, 1963లో ద్వితీయ రాష్టప్రతి సర్వేపల్లి రాథకృష్ణన్‌లు స్వామివారిని దర్శించుకున్నారు. 1995లో రాష్టప్రతి డాక్టర్ శంకర్ దయాళ్‌శర్మ కొండపై స్వామిఅమ్మవార్ల కుంకుమార్చన నిర్వహించారు. 2015జూలై 5న రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ స్వామివారిని దర్శించుకున్నరు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు పంఛనారసింహుడిని సేవించుకున్నారు.
వెంకన్న పట్టు వస్త్రాలు
ప్రతి ఏటా సప్తగిరిశుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పక్షాన బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏకశిఖరుడైనా యాదగిరిశుడి కల్యాణోత్సవానికి పట్టువస్త్రాలు అందించడం ఆనవాయితీగా వస్తుంది. తిరుపతి వెంకన్న పంపించిన వస్త్రాలను టిటిడి అధికారులు ప్రత్యేక పూజలతో యాదాద్రి అర్చకులకు, అధికారులకు అందిస్తారు. యాదాద్రి క్షేత్రం 1969లో దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లాకా నిత్య కల్యాణోత్సవాలు, నిత్య పూజలు, కైంకర్యాలతో స్వామివారికి సేవలందుతున్నా యి. ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో ధార్మిక, సాహిత్య, సంగీ త మహాసభలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేష ప్రాచుర్యం పొందాయి. 1890-1900 నుండి గుట్టపై ధార్మిక, సంగీత, సాహి త్య మహాసభలు సాగుతుండడం విశేషం. కొండపైన 29 ఏళ్లు గా భక్తులకు నిత్యాన్నదానం కొనసాగుతుంది. కొండపైకి చేరుకునేందుకు 1952లో నిర్మించిన ఘాట్‌రోడ్డుకు అదనంగా గత 2017లో రెండో ఘాట్ రోడ్డును ప్రారంభించారు.
అద్భుత శిల్పాల కోవెల..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి తరహాలో దేశంలోనే అద్భుత దివ్యక్షేత్రంగా తీర్చిదిద్ధే బృహత్ సంకల్పంతో సీఎం కేసీఆర్ 1000కోట్ల అంచనా వ్యయంతో ఆలయ పునర్ నిర్మాణ పనులు జరిపిస్తుండగా ఇప్పటికే 700కోట్ల మేరకు ఖర్చు చేశారు. సీఎం హోదాలో కేసీఆర్ యాదాద్రిని ఇప్పటిదాకా 12సార్లు సందర్శించి ఆలయ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. వైటిడిఏ ఆధ్వర్యంలో 2,300ఎకరాల్లో నవగిరుల అభివృద్ధి, గర్భాలయం చుట్టు రెండున్నర ఎకరాల్లో ప్రధానాలయం పునర్ నిర్మాణ పనులు సాగుతున్న క్రమంలో ఈ ఏడాది కూడా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి సూఛనలతో బ్రహ్మోత్సవాలను బాల ఆలయంలోనే నిర్వహిస్తున్నారు. స్వామివారికి నిర్వహించే దశావతార ఆలంకార సేవలు, విశేష వాహాన సేవలన్ని కూడా బాల ఆలయం గడప లోపునే నిర్వహిస్తున్నారు. గడపలోపు స్తంభోద్భవుడిగా ఉద్భవించిన స్వామివారు గడపలోపునే బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం విశేషం.
**
వచ్చే దసరా నాటికి..
ఆలయ పునర్ నిర్మాణంలో భాగంగా సప్త రాజగోపురాలు, శిఖరాలు, చతుర్భుజ ప్రాకారాలు, స్తంభాలు, ముఖ మండపం అన్ని నల్లసరం కృష్ణశిలలతో నిర్మితమవుతున్నాయి. ఇందుకు వేలాది మంది శిల్పులు ఆహార్నిశలు పనిచేస్తున్నారు. దేశంలోని ప్రసిద్ద శిల్ప కళా రీతులు, కాకతీయ శిల్పకళ సమ్మేళనంతో ఆలయ నిర్మాణం సాగుతుంది. సీఎం కేసీఆర్ ఇటీవల ఆలయాన్ని సందర్శించి పనులు ఆలస్యమైన ప్రపంచ శిల్ప కళాద్భుతంగా ఆలయాన్ని తీర్చిదిద్దాలంటు మరిన్ని మార్పులు, చేర్పులు సూచిస్తు ఆర్కితటెక్ట్‌లు, స్థపతులకు మార్గదర్శకం చేశారు. వచ్చే దసరా నా టికి ఆలయ పనులు పూర్తి చేసి స్వయంభూల దర్శనం భక్తులకు అందుబాటులో తేవాలన్న లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. ప్రధానాలయం నిర్మాణాల్లో దశావతరా లు, ఆంజనేయ, ప్రహ్లాద, యాదరుషి విగ్రహాలు, ఆళ్వార్‌ల విగ్రహాలను, పురాణ గాథలతో కూడిన శిల్పాలను, తెలంగాణ నాగరికత, సంస్కృతి ఘట్టాలతో కూడిన శిల్పాలను ఏర్పాటు చేస్తున్నారు. విమానగోపురానికి బంగారు తాప డం చేయనున్నారు. గర్భాలయానికి నృసింహ, ప్రహ్లాద చరిత్రల చిత్రాలను అమరుస్తున్నారు. మహాకల్యాణ మండపం, నూతన పుష్కరణి, కల్యాణకట్ట, రామనుజమండపం, వ్రతమండపం, ప్రవచనశాల, ప్రసాదశాల, ఒకేసారి వేయి మంది కూర్చునే అన్నదాన సత్రం, క్షేత్ర పాలకుడైన ఆంజనేయుడి 150 అడుగుల భారీ విగ్రహం, పార్కింగ్ స్థలం, కొండ దిగువన 1000 ఎకరాల్లో టెంపుల్ సిటీ, పెద్దగుట్టపై ప్రెసిడెన్షియల్ సూట్స్, చుట్టు ఉన్న నవగిరుల్లో పా ర్కులు, ఉద్యాన వనాలు, పూదోటలు, కాటేజీలు, సత్రాల నిర్మాణాలు, గిరి ప్రదక్షిణ దారులు, చెరువుల అభివృద్ధి ప నులతో యాదాద్రిని పర్యాటక, దర్శనీయ స్థలంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే కొండ పై 11కోట్లతో నూతన శివాలయం సైతం నిర్మాణంలో ఉంది.