రాష్ట్రీయం

విశాఖ పోర్టులో ఆదిత్య మిట్టల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ప్రపంచ స్టీల్ పరిశ్రమ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ కుమారుడు ఆదిత్య మిట్టల్ విశాఖ పోర్టును బుధవారం సందర్శించారు. ఆదిత్య మిట్టల్ ప్రస్తుతం ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ సంస్థల చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదిత్య మిట్టల్‌కు విశాఖపట్నం పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ పీఎల్ హరనాథ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోర్టులో జరుగుతున్న కార్యకలాపాలను హరనాథ్ ఆదిత్య మిట్టల్‌కు వివరించారు. పోర్టులో వౌలిక వసతులు, సదుపాయాలు, ఆధునీకీకరణ, యాంత్రీకరణ, కవర్డ్ స్టోరేజీ సదుపాయం, సోలార్ పవర్ ఉత్పత్తి, పోర్టు అంతర్గత అవసరాల నిమిత్తం వినియోగిస్తున్న నీటిశుద్ధి కేంద్రం, పెట్టుబడుల అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆదిత్య మిట్టల్‌తో వచ్చిన బృందానికి వివరించారు. వీటి తో పాటు పోర్టు సామర్థ్యాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా కేప్, సూపర్ కేప్ నౌకలను ఇన్నర్ హార్బర్‌లోకి తీసుకువచ్చేందుకు సింగపూ ర్ పోర్టులో చేపట్టిన చర్యలను అధ్యయనం చేసి న అంశాలను బృందానికి సవివరంగా తెలిపారు. ఆదిత్య మిట్టల్ తన బృందంతో పోర్టులో ఎగుమతి, దిగుమతి సహా వివిధ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. పోర్టు కార్యకలాపాలపై మిట్టల్ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమం లో పోర్టు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం...పోర్టు సందర్శనలో ఆదిత్య మిట్టల్ బృందం