రాష్ట్రీయం

ఎగువ అహోబిలంలో ధ్వజారోహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఎగువ అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున ధ్వజారోహణ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా నిత్య హోమం, సోమ కుంభస్థాపన, పాళికావాహనం, గరుడప్రతిష్ఠ, షోడప కలశ స్థాపన, ధ్వజ పటానికి పూజలు చేసిన అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. ఉత్సవాలు నిరాటంకంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ గరుత్మంతుడి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ధ్వజ స్తంభానికి ఎదురుగా ఉత్సవమూర్తులు శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ప్రత్యేకంగా ఆశీనులై భక్తులను ఆశీర్వదించారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశిన్ స్వామి, అర్చకులు కిడాంబి లక్ష్మీనరసింహాచార్యులు, వేద పండితులు పాల్గొన్నారు. చెంచులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారికి హంస వాహనసేవ, రాత్రి సూర్యప్రభ వాహన సేవ ఉంటాయి. అదేవిధంగా దిగువ అహోబిలంలో ఉదయం ధ్వజారోహణం, రాత్రి సింహవాహన సేవ ఉంటాయి.

*చిత్రం... ఎగువ అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం గావిస్తున్న అర్చకులు