రాష్ట్రీయం

అట్టహాసంగా మేజర్ పోర్టుల క్రికెట్ పోటీలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 2: అఖిల భారత మేజర్ పోర్టుల క్రికెట్ పోటీలు విశాఖ పోర్టు స్టేడియంలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విశాఖపోర్టు ట్రస్టు (వీపీటీ) చైర్మన్ రామ్మోహన రావు పోటీలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 10 మేజర్ పోర్టుల నుంచి క్రికెట్ జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. తొలి మ్యాచ్ వీపీటీ, చెన్నై పోర్టుల మధ్య జరుగగా, వీపీటీ విజయం సాధించింది. పోటీల ప్రారంభం సందర్భంగా వీపీటీ చైర్మన్ కే రామ్మోహన రావు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయన్నారు. ఇటువంటి పోటీల నిర్వహణ వల్ల క్రీడాకారులు ఇతర ప్రాంతాల్లో సంస్కృతి, సంప్రదాయాలను అవగాహన చేసుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఆటల్లో గెలుపోటములు సాధారణమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలని సూచించారు. గెలుపు ఆనందాన్నిస్తే, ఓటమి భవిష్యత్ విజయాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. మ్యాచ్‌లన్నీ టీ 20 ఫార్మాట్‌లో ఈ నెల 6 వరకూ జరుగుతాయన్నారు. ఉదయం, సాయంత్రం మ్యాచ్‌లు జరుగుతాయని, సెమీ ఫైనల్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ వీపీటీ స్టేడియంలో జరుగుతాయన్నారు. పోటీల్లో ముంబై పోర్టుట్రస్టు, కోల్‌కతా పోర్టు ట్రస్టు, దీన్‌దయాళ్ పోర్టు ట్రస్టు, ట్యూటికోరిన్ పోర్టు ట్రస్టు, పారాదీప్ పోర్టుట్రస్టు, జవహర్‌లాన్ నెహ్రూ పోర్టుట్రస్టు, చెన్నై పోర్టుట్రస్టు, న్యూ మంగళూరు పోర్టుట్రస్టు, కొచ్చిన్ పోర్టుట్రస్టు, విశాఖపోర్టుట్రస్టు (ఆతిథ్య పోర్టు) పాల్గొంటున్నాయి. ఉదయం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై పోర్టుపై వీపీటీ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మధ్యాహ్నం జరిగిన మరో మ్యాచ్‌లో ట్యూటికోరిన్ పోర్టుపై కోల్‌కతా పోర్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
*చిత్రం... క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న వీపీటీ చైర్మన్ రామ్మోహన రావు