రాష్ట్రీయం

కడప ఎంబీబీఎస్ విద్యార్థి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం, మార్చి 3: ఫిలిప్పైన్స్ దేశంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి మేరువ శ్రీహరి(21) దుర్మరణం చెందా డు. ఈ విషయాన్ని విద్యార్థి చదువుతున్న కళాశాల సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలపడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. కడప జిల్లా సిద్దవటం మండలం ఉప్పరపల్లె గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మేరువ ప్రసాద్ కుమారుడైన శ్రీహరి ఫిలిపైన్స్ దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ పెరూఫెస్టివల్ హెల్ప్‌లో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్య అభ్యసిస్తున్నాడు. ఈనెల 23వ తేదీ పరీక్షలు పూర్తి చేసుకుని 25న స్వగ్రామానికి రావాల్సివుంది. శ్రీహరి సోమవారం తన తండ్రికి ఫోన్‌చేసి ఇదే విషయాన్ని సమాచారం ఇచ్చాడు. 2వ సంవత్సరం విద్య అభ్యసించేందుకు వీసా రెన్యూవల్ చేసుకుని ఈనెల 25న స్వగ్రామానికి వస్తానని, అందుకు అవసరమైన డబ్బు పంపాలని కోరాడు. అందుకు ప్రసాద్ సరేనన్నాడు. అయితే సోమవారం రాత్రి భోజనం చేసేందుకు శ్రీహరి తన స్నేహితులతో కలిసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో స్నేహితుని కాలు విరగ్గా, శ్రీహరి తల వెనుక భాగంలో బలమైన గాయమైంది. తీవ్రంగా గాయపడిన శ్రీహరిని స్థానికులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శ్రీహరి మృత్యువాత పడ్డాడు. రోడ్డుప్రమాదం సమాచారాన్ని కళాశాల సిబ్బంది ప్రసాద్‌కు తెలియజేశారు. రోడ్డుప్రమాదం వార్త తెలియగానే ప్రసాద్, అతని భార్య వెంకటసుబ్బమ్మ కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, మాజీ మేయర్ సురేష్‌బాబు, ఎంపీని కోరారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.
*మృతి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి మేరువ శ్రీహరి
(ఫైల్‌ఫొటో)