రాష్ట్రీయం

వైభవంగా శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం వరాహ పుష్కరిణిలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయం సంధ్యవేళ చల్లని వాతావరణంలో తెప్పపై విహరిస్తున్న స్వామివారిని తిలకించిన భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు. 5రోజుల పాటు జరిగే ఈ తెప్పోత్సవాల్లో తొలిరోజు స్వామివారు సీతారామలక్ష్మణ సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఈ తెప్పోత్సవం మూడు చుట్లు తిరిగింది. అంతకుమునుపు సాయంత్రం 6 గంటలకు సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా రాములవారి ఉత్సవమూర్తులు 4 మాడవీధుల్లో విహరిస్తూ శ్రీవారి పుష్కరిణికి చేరుకున్నారు. ఈకార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, భారత కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహరీష్, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, సీఐ రామచంద్రారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఆరోగ్యశాఖాధికారి డాక్డర్ ఆర్‌ఆర్ రెడ్డి, ఉద్యానవనం శాఖ ఉప సంచాలకులు శ్రీనివాసులు, ఎస్‌ఈ నాగేశ్వరరావు, డీఈ సరస్వతి, ఈఈలు శ్రీహరి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

*చిత్రాలు.. ..తిరుమల శ్రీవరాహ పుష్కరిణిలో శ్రీమలయప్పస్వామి ఉభయ దేవేరులతో సీతారాములుగా విహరిస్తున్న దృశ్యం
. తెప్పపై కొలువై ఉన్న శ్రీ మలయప్పస్వామికి పూజలు చేస్తున్న టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి