రాష్ట్రీయం

దుర్గమ్మ అంతరాలయ దర్శనానికి డ్రెస్ కోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) మార్చి 7: వచ్చే ఉగాది నుండి కనకదుర్గ అమ్మవారి అంతరాలయం దర్శనం చేసుకునే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ఈ మేరకు శనివారం జరిగిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్‌బోర్డు తొలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానం ఈవో ఎంవీ సురేష్‌బాబు 10 అంశాలతో అజెండాను రూపొందించి ప్రవేశ పెట్టారు. అజెండా అంశాలపై పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు ధర్మకర్తలతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం 9 అంశాలను ఆమోదించారు. మహిళలు చీర, పంజాబీ డ్రస్‌తో పాటు చున్నీ విధిగా ధరించి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. తిరుమల-తిరుపతి దేవస్థానం తరహాలో అమ్మవారి అంతరాలయం దర్శనం చేసుకోనే భక్తులు తెలుగువారి తొలి పండుగ ఉగాది నుండి పురుషులు పంచె, కండువా .. లాల్చీ, పైజామా ధరించిన వారిని మాత్రమే అంతరాలయంలోనికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదేవిధంగా ఉచిత దర్శనం, అమ్మవారి ముఖ మండప దర్శనం చేసుకోనే వారికి మాత్రం ఈ నిబంధన వర్తించదని సభ్యులు స్పష్టం చేశారు. వీఐపీలు సైతం విధిగా ఈ నిబంధన పాటించాలని విజ్ఞప్తి చేశారు. వేకువ జామున నిర్వహించే ఖడ్గమాల పూజ నుండి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి రోజు నిర్వహించే వివిధ రకాలైన అర్జిత సేవల్లో పాల్గొనే ఉభయదాతలు విధిగా సాంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొంటున్నారనీ, ఇదేవిధంగా ఈనెల 25వ తేదీ నుండి అంతరాలయ దర్శనం చేసుకొనే భక్తులు సైతం విధిగా ఈ నిబంధనను పాటించాలని ఇందుకు భక్తులకు అవసరమైన అన్ని రకాలైన సదుపాయాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇదేవిధంగా రానున్న దసరా మహోత్సవాలకు ప్రభుత్వం నుండి నిధుల విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళేందుకు నిర్ణయం తీసుకున్నారు. గత ట్రస్ట్‌బోర్డు హయాంలో జరిగిన వివిధ అవినీతి ఆరోపణలపై త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేసి నిజాలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్, సహాయ ఈవోలు ఎన్ రమేష్, చంద్రశేఖర్, బి వెంకటరెడ్డి, 16మంది ధర్మకర్తలు పాల్గొన్నారు.