రాష్ట్రీయం

లేపాక్షి ఉత్సవాల్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి, మార్చి 8: లేపాక్షి వైభవ్-2020 ఉత్సవాల్లో భాగంగా గురుకుల పాఠశాల మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యం తం ఆహుతులను అలరించాయి. అనంతపురం జిల్లా లేపాక్షిలో కలెక్టర్ గంధం చంద్రుడు నేతృత్వంలో టూరిజం శాఖ రీజినల్ డైరెక్టర్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో లేపాక్షి ఉత్సవాల్లో రెండో రోజైన ఆదివారం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు జానపద నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం, వివిధ సంస్కృతులు ఉట్టిపడేలా నృత్యా లు చేయడంతో పాటు దేశభక్తి గేయాలు ఆలపించారు. గ్రామీణ క్రీడలైన గోలీలాట, బొంగరాలాట, విలువిద్య, తదితర క్రీడలను విద్యార్థులు ప్రదర్శించారు. చివరగా వీరభద్రాలయ ఈఓ నరసింహమూర్తి ఆధ్వర్యంలో శివ, పార్వతుల గ్రామోత్సవం నిర్వహించారు. అంతకుముందు దేవదాయ శాఖ సహాయ కమిషనర్ రామాంజనేయులు, ఇన్‌స్పెక్టర్ నరసింహరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు.
*చిత్రాలు..లేపాక్షి ఉత్సవాల్లో విద్యార్థుల నృత్య ప్రదర్శన
*విల్లు ఎక్కు పెట్టిన విద్యార్థులు