రాష్ట్రీయం

ఆంధ్రా దూరవిద్య కేంద్రాలపై తెలంగాణలో ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన అనంతరం విద్యాశాఖ నిధుల కోసం, ఉన్నత విద్యా మండలి ఏర్పాటుకు, తెలుగు అకాడమీ విభజనకు కయ్యానికి కాలుదువ్విన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుడు కొత్త వైరానికి కాలుదువ్వుతున్నా యి. ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్శిటీలు ఆఫర్ చేస్తు న్న దూర విద్య కోర్సులను తెలంగాణలో రద్దు చేస్తున్నాయి. ఇప్పటికే చదువు పూర్తిచేసినవారు ఆ డిగ్రీలు చేతిలో పెట్టుకుని వస్తుంటే అవి ఇక్కడ చెల్లవని చెబుతున్నారు. అదే తెలంగాణలోని యూనివర్శిటీలు ఆఫ ర్ చేస్తున్న దూర విద్య డిగ్రీలను ఆంధ్రా ప్రాంతంలో చెల్లుబాటు అవుతున్నపుడు తెలంగాణలో ఎలా చెల్లవని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అడ్మిషన్లు ప్రస్తుతం ‘ఇతర రాష్ట్రం’ పేరుతో కాకుండా ‘రీజియన్’ పేరుతో జరుగుతున్నాయి. ఓయూ, ఏయూ, ఎస్వీయూ పేరుతో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులన్నింటిలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2024 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నపుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన డిగ్రీలు ఎందుకు చెల్లవని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, ఇంగ్లీషు ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ, కాకతీయ, ఉర్దూ నేషనల్
యూనివర్శిటీ, నల్సార్, ఉస్మానియా యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ దూర విద్యా కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. కాకతీయ యూనివర్శిటీ ఆనాడు అధికారికంగా ఆంధ్రాలో స్టడీ సెంటర్లు కొనసాగించింది. ఉస్మానియా తప్ప మిగిలిన వర్సిటీలు రెండు రాష్ట్రాల్లో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అదే రీతిన ఆంధ్రాలో నాగార్జున వర్సిటీ, ఆంధ్రా, గీతం, కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ, రాష్ట్రీయ సంస్కృత విద్యాసంస్థ, కృష్ణదేవరాయ, పద్మావతి మహిళా యూనివర్శిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ ఆఫర్ చేస్తున్నాయి. వీటికి తోడు తమిళనాడులోని అలగప్పా, అన్నా యూనివర్శిటీ, మద్రాస్ యూనివర్శిటీ, మదురై కామరాజ్ యూనివర్శిటీ, పెరియార్, షణ్ముగం, రామచంద్ర, ఎస్‌ఆర్‌ఎంతో పాటు తమిళనాడు ఓపెన్ యూనివర్శిటీ కూడా అనధికారిక స్టడీ సెంటర్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఇతర ప్రాంతాల యూనివర్శిటీలపై ఆంక్షలు విధించాలన్న ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని వేరే వర్సిటీల స్టడీ సెంటర్ల అధ్యయనం కోసం ఉస్మానియా యూనివర్శిటీ ఒక కమిటీని నియమించి, నాగార్జున వర్సిటీ కేంద్రాలను మూసివేయించేందుకు సిద్ధమైంది. ఉభయ రాష్ట్రాల్లో నాగార్జున 304 స్టడీ సెంటర్లలో 68 ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కలే దాదాపు 40 కేంద్రాలను నిర్వహిస్తోంది. వేలాది మంది విద్యార్థులు చేరుతున్నారు. 8 ఎమ్మెస్సీ, 12 ఎంఏ, ఐదు ఎంబీఏ, ఒక ఎంసీఏ, రెండు ఎంకాం కోర్సులతో పాటు మిగిలిన యూజీ సర్ట్ఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. తెలంగాణ ఏర్పాటైన నాటి నుండి వౌనంగా ఉన్న అధికారులు అకస్మాత్తుగా నాగార్జున వర్సిటీ డిగ్రీలు చెల్లవని చెప్పడంతో విద్యార్ధులు ఖంగుతింటున్నారు. ఇతర రాష్ట్రాల డిగ్రీలు చెల్లినపుడు కేవలం నాగార్జున వర్సిటీ డిగ్రీలపైనే ఆంక్షలు పెట్టడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి నాగార్జున యూనివర్శిటీ మిగిలిన అన్ని వర్సిటీల కంటే భిన్నంగా సకాలంలో పరీక్షలు నిర్వహించి వెనువెంటనే ఫలితాలను, సర్ట్ఫికెట్లను జారీ చేస్తూ స్డూడెంట్ ఫ్రెండ్లీ యూనివర్శిటీగా పేరుతెచ్చుకుంది. ఉస్మానియా దూర విద్య కేంద్రం నిరంతరం పరీక్షలు వాయిదా వేస్తూ, ఫలితాల జారీలో గందరగోళం లేదా జాప్యం జరగడంతో ఎక్కువమంది ఇతర వర్సిటీల దూరవిద్యపై మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు గత నాలుగేళ్లలో దూరవిద్యలో ఎంతో గందరగోళం నెలకొంది.
వేళ్లూనుకుపోతున్న అవినీతి విద్యారంగంలో అక్రమాలను కప్పేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ నియంత్రణ సంస్థలకు పట్టింపు లేకపోవడం, రాష్టస్థ్రాయిలో ఉన్నత విద్యామండలికి గానీ, యూనివర్శిటీలకు గానీ అడిగేవారు లేకపోవడంతో సార్వత్రిక విద్య, దూర విద్య పేరుతో విద్యార్థులను దోచుకుంటున్నా అడిగే నాథుడే లేకుండా పోయాడు. ప్రభుత్వ యూనివర్శిటీలు సైతం అడ్డదారుల్లో పయనిస్తున్నా, వీసీలు, రిజిస్ట్రార్లు, ఇతర డైరెక్టర్లు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడంతో దూరవిద్య మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా ఆర్థిక వనరుగామారిపోయింది. దూరవిద్య కోర్సుల్లో చదువుకునే వారి పట్ల కొంత చూసీచూడనట్టు వ్యవహరిస్తే చాలు అటు కోర్సులను నిర్వహిస్తున్న స్టడీ సెంటర్లకు, నిర్వాహకులకు, యూనివర్శిటీకి డబ్బే డబ్బు.
యూనివర్శిటీలు లేదా ఉన్నత విద్యా సంస్థలు దూర విద్యను లేదా సార్వత్రిక విద్యను, ఆన్‌లైన్ విద్యను నిర్వహించాలంటే 2013 వరకూ వాస్తవానికి ఎలాంటి నియంత్రణా లేనే లేదు. అంతవరకూ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం చెప్పిందే వేదం అన్నట్టు సాగింది. అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో పాటు ఎన్ ఆర్ మాధవ్ మీనన్ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సులతో దూరవిద్య నియంత్రణ యూజీసీ చేతుల్లోకి వచ్చింది. దీనికోసం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి 2017 జూన్ 23న ఓపెన్ డిస్టెన్స్ రెగ్యులేషన్స్‌ను, 2018 జూలై 4న ఆన్‌లైన్ కోర్సెస్, ప్రోగ్రామ్స్ రెగ్యులేషన్ పేరుతో రెండు చట్టాలను తీసుకువచ్చింది. వాటిని రాష్ట్రాలకు పంపించి అమలు చేయమని కోరేలోగానే 2017 అక్టోబర్ 11న, 2018 ఫిబ్రవరి 6న, 2018 సెప్టెంబర్ 6న, 2019 జూన్ 6న నాలుగుమార్లు ఆ చట్టాలను సవరించింది. దాంతో అసలు చట్టంలో ఏముందో, ఏ మేరకు సవరణలు చేశారో అర్థం చేసుకునేలోగానే యూనివర్శిటీలు దూరవిద్య పేరుతో దున్నుకున్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానం అమలులోకి రానుంది. దాంతో దూరవిద్య విధానంలో కూడా మార్పులు వస్తాయని చెబుతున్నారు. అంతలోనే ఉన్నత విద్యా మండలి ఆంధ్రాకు చెందిన యూనివర్శిటీలు ఆఫర్ చేస్తున్న డిస్టెన్స్ సర్ట్ఫికెట్లు చెల్లవని చెప్పడంతో విద్యార్థులు కుంగిపోతున్నారు.