రాష్ట్రీయం

శ్రీవారి దర్శనానికి కరోనా ఎఫెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 14: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బ శ్రీవారి దర్శనంపై పడింది. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహించాలనుకున్న కల్యాణాన్ని ఆలయం వెలుపల నిర్వహించకూడదని నిర్ణయించారు. పెద్దఎత్తున భక్తులు చేరితే ఎక్కడ కరోనా వ్యాప్తిచెందుతోందన్న ఆందోళనతోనే టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే స్వామివారి కల్యాణాన్ని ఏకాంతంగా నిర్వహించి వాటిని ఎస్వీబీసీ, ఇతర ప్రసారాల మాధ్యమాల ద్వారా భక్తులు వీక్షించే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. దేశంలో కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుణ్యక్షేత్రాలలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా నిరంతరం 70 నుంచి లక్ష మంది భక్తులు వచ్చే తిరుమలలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ యాజమాన్యాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ఆదేశించారు. దీంతో టీటీడీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా శ్రీవారిని సర్వదర్శనంలో వెళ్లి స్వామిని దర్శించుకునే భక్తులు వైకుంఠం కాంప్లెక్స్‌లో వేచి ఉంటారు. రద్దీ గణనీయంగా పెరిగితే వైకుంఠం కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి వెలుపల క్యూలైన్‌లలో బారులు తీరుతారు. ఈక్రమంలో వేలాది మంది భక్తులు అత్యంత సమీపంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైకుంఠం కాంప్లెక్స్‌లో 500 మంది సామాన్య భక్తులు వేచి ఉండే చోట 250కు కుదించారు. అయితే రోజురోజుకూ కరోనా వైరస్
భయం పెరుగుతున్న నేపథ్యంలో వైకుంఠం కాంప్లెక్స్‌లో భక్తులను వేచి ఉండకుండా చూడాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించింది. అలాగే భక్తులకు పలు జాగ్రత్తలను కూడా సూచిస్తూంది. ఇక వారోత్సవం పూజలైన సోమవారం జరిగిన విశేషపూజ, బుధవారం జరిగే సహస్ర కలిశాభిషేకం, నిత్యం జరిగే వసంతోత్సవం సేవలను టీటీడీ రద్దుచేసింది. ఈ సేవల టిక్కెట్లను ఇప్పటికే రిజర్వ్‌చేసుకున్న వారు రద్దుచేసుకోవడానికి అవకాశం కల్పించింది. అలాకాని పక్షంలోవారికి వీఐపీ దర్శనం సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ ఈఓ ఏకే సింఘాల్ తిరుమల అదనపు ఈఓ ధర్మారెడ్డితో కలిసి శనివారం అన్నమయ్యభవన్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి టీటీడీ నిర్ణయాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యేక జాబితాను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఈనెల 17న మంగళవారం నుంచి టైం స్లాట్ టోకెన్లు జారీ చేయడం ద్వారా యాత్రికులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
టైంస్లాట్ టోకెన్లు జారీ
ఈనెల 17న వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లో వేచి ఉండకుండా టైంస్లాట్ టోకెన్లు పొందిన భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. భక్తులు కంపార్ట్‌మెంట్‌లో వేచి ఉంటే కరోనా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉంటుందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల, తిరుపతిలో టైంస్లాట్ టోకెన్లను భక్తులకు ఇవ్వడాని కోసం విస్తృతంగా కౌంటర్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. టైంస్లాట్ టోకెన్లు తీసుకునే భక్తులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపుకార్డును తీసుకురావాలని స్పష్టం చేశారు. భక్తులు తమకు కేటాయించిన సమాయానికి మాత్రమే స్వామి దర్శనానికి రావాలని విజ్ఞప్తిచేశారు. విశేషపూజ, సహస్ర కలశాభిషేకం, వసంతోత్సవం వంటి సేవలను రద్దు చేశామన్నారు. ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 7న నిర్వహించదలచిన సీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయం వెలుపల రద్దు చేశామని, గతంలో మాదిరిగానే ఆలయం లోపల నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 5న ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఏర్పాటు చేసిన భూమిపూజ కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు.