రాష్ట్రీయం

సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 16: శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చే సామాన్య భక్తులు ఒక రోజులోనే రెండు మూడు పర్యాయాలు దర్శనం చేసుకుంటున్నారు. ఇది నిజమేనా అని అనుకుంటున్నారా.. కరోనా సాక్షిగా ఇది అక్షర సత్యం. వివరాల్లోకి వెళితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరం ఉన్న భక్తులు తమ పర్యాటనను వాయిదా వేసుకోమని సాక్షాత్తు టీటీడీ యాజమాన్యమే కాదు, శ్రీకాళహస్తి లాంటి పుణ్యక్షేత్రంలో ఉన్న అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్న విషయం పాఠకులకు విదితమే. కరోనా వైరస్ క్రమంలో సంపన్నులు కూడా శ్రీవారి దర్శనానికి రావడానికి ఆలోచన చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కూడా తమ పర్యటనను వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్వామిపై అపారమైన భక్తి, విశ్వాసాలు ఉన్న భక్తులు మాత్రం శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వస్తున్నారు. వచ్చిన వారికి స్వామి దర్శనం సంపూర్ణంగా సంతృప్తిగా సాగుతోంది. వివరాల్లోకి వెళితే కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా నివారణ చర్యలతో పాటు టీటీడీ ముందస్తు జాగ్రత్తలు చేపడుతుంది. అయినప్పటికీ ఇటు మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సంపన్నులు తిరుమలకు రావడానికి సంకోచిస్తున్నారు. సామాన్య భక్తులు మాత్రం యధావిధిగా తిరుమలకు వస్తున్నారు. సర్వసాధారణంగా సోమవారం 60 నుంచి 70 వేల మంది శ్రీవారిని దర్శించుకుంటారు. కరోనా వైరస్ ప్రభావంతో సోమవారం 44వేల మంది మాత్రమే సోమవారం రాత్రి 11గంటల వరకు దర్శనం చేసుకున్నారు. మరో 10 వేల మంది లైన్‌లో ఉంటారని అంచనా. అయితే ఈ 50 వేల మంది భక్తుల్లో కూడా తిరుమలకు వచ్చే భక్తులు 30 వేల మంది మాత్రమే. దీనితో ఒక్కో సామాన్య భక్తుడు రెండు, మూడు పర్యాయాలు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అంతేకాకుండా సామాన్య భక్తులు పొందే మహాలఘు దర్శనం సమయంలో నిమిషానికి వందల మందిని అక్కడున్న సిబ్బంది జరగండి... జరగండి... అనే ప్రక్రియ జరుగుతుంటుంది. అయితే సోమవారం మాత్రం స్వామివారిని మహాలఘు దర్శనంలో వెళ్లిన భక్తులకు మాత్రం బంగారు వాకిలిలో జరగండి అనే పదమే వినిపించలేదు. దీంతో ఆలయంలోకి వెళ్లిన భక్తులు స్వామివారిని మనసారా, కనులారా సంతృప్తిగా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రీవారి దర్శనం కోసం వస్తున్నామని, ఏనాడూ ఇంత సంతృప్తిగా దర్శనం చేసుకోలేదని ఆనందం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ జిందాబాద్ అన్నారు. ఇదిలావుండగా, సర్వసాధారణంగా శ్రీవాణి ట్రస్టు ద్వారా వీఐపీ దర్శనంలో 600 నుంచి 750 మంది ఒక్కొక్కరు పది వేల రూపాయలు విరాళం ఇచ్చి స్వామిని దర్శనం చేసుకునేవారు. అయితే సోమవారం కేవలం 250 మంది మాత్రమే శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చి దర్శించుకున్నారు. మొత్తం మీద వెయ్యి మంది మించకుండా సోమవారం వీఐపీలు స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కూడా సిఫార్సు ఉత్తరాలు ఇవ్వకపోవడంతో వీఐపీల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పాలి. భక్తి అంటే ఇదిరా అంటున్నారు సామాన్య భక్తులు.