రాష్ట్రీయం

పీఎఫ్ కార్యాలయానికీ తప్పని కరోనా ‘సెగ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: కోవిడ్ మహమ్మారిని నివారించే క్రమంలో కేంద్రప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్ బర్కత్‌పురలోని ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కార్యాలయంలో వాటాదారుల సందర్శనను తగ్గించాలని నిర్ణయించినట్టు రీజనల్ పీఎఫ్ కమిషనర్ విపిన్ కుమార్ శరణ్ తెలిపారు. ఒకరినొకరు తాకడం, ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమిగూడటం వల్ల కరోనా వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. పీఎఫ్ సభ్యులు అత్యవసర పరిస్థితుల్లో తప్ప కార్యాలయాన్ని సందర్శించవద్దని వారు సూచించారు. కార్యాలయానికి వచ్చే సభ్యులపై పరిమితులు విధించినట్టు వారు తెలిపారు. సాధారణ విచారణ, సమస్యల నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ సెంటర్ నెంబర్లు 18005999911కు లేదా 040-27564576కు ఫోన్ చేసి పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా ఇమెయిల్, ట్విట్టర్, ఫెస్‌బుక్ అకౌంట్ల ద్వారా కూడా వాటాదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు.
ఈ మెయిల్ ro.hyderabad@epfindia.gov.in
ట్విట్టర్ @e@pfohyderabad(Barkatpura)
@epfhyderabad(Madhapur)
ఫేస్‌బుక్ epfohyd Barkatpura