రాష్ట్రీయం

శ్రీశైలంలో కరోనా నియంత్రణ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు శ్రీశైలంలో ఈనెల 22 నుంచి 26 వరకు జరిగే ఉగాది ఉత్సవాల్లో కరోనా వైరస్ ప్రభావాన్ని నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు పెద్దసంఖ్యలో శ్రీశైలం తరలిరాకుండా చర్యలు తీసుకోవాలని 14 జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశామని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం శ్రీశైలంలో నిర్వహించే ఉగాది మహోత్సవాలకు కర్నాటక, తెలంగాణ నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారన్నారు. అయితే ఈసారి కరోనా వైరస్ ప్రభావం ఉండడంతో శ్రీశైలం పర్యటనను వాయిదా వేసుకోవాలని భక్తులకు సూచిస్తున్నామన్నారు. కర్ణాటక రాష్ట్రం బెల్గాం, బీజాపూర్, బాగల్కోట్, రాయచూరు, గుల్బర్గా, బీదర్, యాదగిరి, ధర్వాడ్, బళ్ళారి జిల్లాల నుండి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారన్నారు. భక్తులు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని ఆ లేఖలో కోరామన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, గద్వాల్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నల్గొండ జిల్లాల నుంచి కూడ భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆయా జిల్లాల నుంచి శ్రీశైలం వచ్చే భక్తులను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. ఈనెల 17 నుంచి శ్రీమల్లికార్జునస్వామి వారి స్పర్శ దర్శనం నిలుపుల చేశామని కేవలం అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. మల్లికార్జునస్వామి వారికి నిర్వహించే ఆర్జిత సామూహిక, గర్బాలయ అభిషేకం, భ్రమరాంబాదేవికి నిర్వహించే ఆర్జిత కుంకుమార్చన సేవలు, చండీహోమం, రుద్రహోమం ఇతర ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనాలు కూడ రద్దు చేశామన్నారు. గ్రామోత్సవాలు, ప్రభోత్సవాలు, వీరచరణ విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం, హోమాలు, జపాలు, అనుస్థానాల్లో లలో భక్తుల భాగస్వామ్యాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిత్య కళారాధన వేదికపై నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను సైతం రద్దు చేసామని కలెక్టర్ వివరించారు. కరోనా వైరస్ ప్రభావితం కాకుండ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని జిల్లాల్లో నియంత్రణపై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను కోరామని ఆయన వివరించారు.
శ్రీశైలంలో కరోనా ప్రభావం తగ్గించేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. దేవస్థానం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, క్యూలైన్లలో శానిటైజర్లు అందుబాటులో ఉంచి భక్తులు చేతులు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులు క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అధిక సమయం వేచి ఉండకుండా స్వామి అమ్మవార్ల దర్శనాన్ని వేగవంతంగా పూర్తి చేయించి పంపేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.
వృద్ధులు, చిన్నపిల్లలను శ్రీశైలం తీసుకురావద్దని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉగాది రోజున జరిగే రథోత్సవం, గ్రామోత్సవం రద్దు చేస్తామన్నారు.

*చిత్రం...శ్రీశైలం దేవస్థానం