రాష్ట్రీయం

309 రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారిని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వం సిద్ధమయ్యాయి. స్వచ్ఛందంగా ప్రజలు జనతా కర్ఫ్యూకు మద్దతు పలకాలని అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో ఆదివారం నాడు ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనున్నది. అత్యవసర సేవలకు మాత్రం ప్రజలు ఇంటి నుంచి బయటపడాలని సూచించడంతో ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. దేశంలో రవాణా రంగంలో అతిపెద్దది అయిన రైల్వేరంగం పూర్తిస్థాయిలో జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడానికి రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ద.మ. రైల్వే
ప్రకటించింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ 309 రైళ్లను నిలిపివేయనున్నారు. ప్రయాణికులకు కరోనా వైరస్ సోకకుండా వైద్య బృందాలను అప్రమత్తం చేసింది. హైదరాబాద్ జంటనగరాల్లో ఉన్న ప్రజలకు అత్యవసర సేవల కోసం ఎంఎంటీఎస్ సర్వీసులను కుదించారు. కేవలం ఆదివారం 12 సర్వీసులను మాత్రం నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.15 గంటలకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయి. షిర్డీ వెళ్లే నర్సాపూర్- నాగర్‌సోల్ రైల్‌ను ఆదివారం రద్దు చేశారు. ఈనెల 21వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ మధ్యకాలంలో వివిధ ప్రాంతాలకు ముందుగానే టికెట్లను రిజర్వు చేసుకున్న వారికి పూర్తిస్థాయిలో టికెట్ల సొమ్మును తిరిగి ఇవ్వనున్నారు. రైల్ టికెట్లను రద్దు చేసుకోవడానికి బుకింగ్ కౌంటర్ల వద్దకు ప్రయాణికులు రావాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. టికెట్లను రద్దు చేసుకోవడానికి 45 రోజుల వ్యవధి ఉంటుంది. టికెట్ల రద్దుపై ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రయాణికులు టికెట్లను రద్దు చేసుకోవడానకి రైల్వే 139 నెంబర్‌కు ఫోన్ చేసుకోవచ్చునని రైల్వే అధికారులు తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రంలో ప్రజా రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ బస్సులు ఆదివారం నాడు డిపోలకే పరిమితం కానున్నాయి. రాష్ట్రంలో ఉన్న 97 డిపోల్లో దాదాపు 10,473 బస్సులు బంద్ కానున్నాయి. అత్యవసర సేవల కోసం ప్రతి డిపో వద్ద 5 బస్సులు, ఐదుగురు సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆర్టీసీ సీపీఆర్‌వో కిరణ్‌రెడ్డి తెలిపారు.