రాష్ట్రీయం

శ్రీవారికి కైంకర్యాలు యధాతథంగా నిర్వహించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 21: కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమలలో భక్తులను స్వామి దర్శనానికి అనుమతించకపోయినా శ్రీవారి కైంకర్యాలు వైఖానస ఆగమోక్తంగా యధాతథంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ వైఖానస సభ గోశాస్త్ర ప్రకారం తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామివారికి అనేక వేల సంవత్సరాల నుంచి ఆరాధనలు జరుగుతున్నాయన్నారు. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో లోకకల్యాణం కోసం స్వామివారి పరిపూర్ణ అనుగ్రహంతో ఈ విపత్తుల నుంచి ప్రజలు క్షేమంగా బయటపడాలని, స్వామివారికి ప్రత్యేకంగా మూలమంత్రాన్ని జపిస్తున్నామన్నారు. ఈ లోకక్షేమం కోసమే ఈ రెండు రోజులు కూడా అర్చకులందరూ ప్రత్యేక పూజలు చేస్తున్నారన్నారు. అనాధిగా నాలుగు కుటుంబాల అర్చకులు స్వామివారికి కైంకర్యాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారన్నారు. ఈక్రమంలోనే శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపినప్పటి నుంచి స్వామివారి పవళింపు కోసం నిర్వహించే ఏకాంతసేవతో పాటు ఆ రోజుల్లో జరిగే నైవేధ్యాలు, కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం, శనివారం కూడా స్వామివారిని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష ఆభరణాలతో అలంకరించనున్నట్లు చెప్పారు. ఈనేపథ్యంలో ఉగాది పర్వదినం ముందురోజైన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించనున్నామన్నారు. అంటే ఆలయంలోప్రతి అంగుళాన్ని శుద్ధిచేసే కార్యక్రమం జరుగుతుందన్నారు. శనివారం సుప్రభాతం, తోమాల, కొలువు, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించామన్నారు. ఇక సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే విశేష పూజలు, ప్రతి నిత్యం అద్దాల మేడలో జరిగే ఊంజల్‌సేవ, కల్యాణోత్సవం యథాతథంగా జరుగుతుందన్నారు. కల్యాణోత్సవాన్ని ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా భక్తులు వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చన్నారు.