రాష్ట్రీయం

‘స్థానిక’ ఎన్నికల నిలిపివేత వెనుక ఆ అదృశ్య శక్తులు ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్‌కుమార్ నిజంగా కరోనా వైరస్ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎన్నికలను వాయిదా వేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించేదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్‌నాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల అధికారి స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్న సమయంలో సాక్షాత్తూ తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ అధికారులతో కరోనాపై చర్చిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే, ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఎన్నికలను వాయిదా వేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు. అలాంటి సంస్కృతికి పాటించకుండా రాష్ట్ర ఎన్నికల అధికారి వ్యవహరించడం దుర్మార్గం అని ఆయన అన్నారు. రాజ్యాంగం చెప్పిన విధంగా 73, 74 సవరణలను కోట్ చేస్తూ ఎన్నికల కమిషనకు అధికారాలు ఉన్నాయని మొండిగా వెళ్లారని ఆయన అన్నారు. ఎన్నికల అధికారి నిర్వాకంతో రాష్ట్రానికి రావాల్సిన నిధు రాకుండా చేశారని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కిషన్ సింగ్ తోమర్ కేసును ప్రస్తావిస్తూ ఎన్నికలను వాయిదా వేయడం సరైన చర్య కాదన్నారు. ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటే అప్పుడు కిషన్ సింగ్ తోమర్ కేసును కోట్ చేయాలనీ, కానీ తాము మాత్రం ఎక్కడా ఎన్నికల నిర్వహణకు అడ్డు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. కిషన్ సింగ్ తోమర్ కేసును కోడ్ చేయడమంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆపించాలని ఎవరు ప్రోత్సహించారో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పష్టం చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.