రాష్ట్రీయం

ఎక్కడి రైళ్లు అక్కడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: కరోనా వైరస్ మహమ్మారిని పూర్తిగా నియంత్రించడానికి ముందస్తు చర్యగా జనతా కర్ఫ్యూను ఈనెల 31వ తేదీ వరకు కొనసాగించనున్నారు. ఇబ్బందులు ఉన్నా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని రైల్వే సూచించింది. దేశంలో అతిపెద్ద రవాణారంగం అయిన రైల్వే 453 రైళ్లను నిలిపివేసింది. ఈ రైళ్లు ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి వరకూ ఆగిపోనున్నాయి. జూన్ 21 వరకు ప్రయాణికులు
రిజర్వు చేసుకున్న టికెట్లను రైల్వే శాఖ రద్దు చేసింది. అప్పటివరకు రిజర్వు చేసుకున్న ప్రయాణికుల టికెట్ల సొమ్మును మళ్లీ వారికి అందజేయనున్నారు. కేవలం సరుకు రవాణా చేస్తున్న గూడ్స్ రైళ్లను మాత్రమే నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాగా, తెలంగాణలో ఆర్టీసీని పూర్తిస్థాయిలో నిలిపివేశారు. దీంతో 97 డిపోల నుంచి 10,473 బస్సులు కదిలే పరిస్థితి లేదు. ఆటో, ప్రైవేట్ వాహనాలను సైతం రోడ్ల పైకి రాకుండా నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించి వ్యవహరించిన ప్రైవేట్ వాహనాలను స్వాధీనం చేసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇదిలావుండగా, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు జనతా కర్ఫ్యూ పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యింది. కర్ఫ్యూతో అటు రైల్వే స్టేషన్లు, ఇటు ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా కన్పించాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైళ్లు ఆలస్యంగా స్టేషన్లకు చేరుకున్నాయి. దీంతో హైదరాబాద్, సికిందరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో దిగిన ప్రయాణికులు ఎటుపోవాలో తెలియక తికమకపడ్డారు. అయితే పోలీసులు అత్యవసరంగా ఆర్టీసీ అధికారులతో సంప్రదించారు. దీంతో తక్కువ సంఖ్యలో బస్సులను తెప్పించి ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు పంపించారు. వివిధ రకాల వాహనాలను రవాణాకు అనుమతి ఇస్తే ప్రజలు మళ్లీ బయటకు వస్తే కరోనా వైరస్ ప్రబలే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో రవాణా రంగాన్ని నిలిపివేయక తప్పలేదని అధికారులు గుర్తు చేస్తున్నారు.

*చిత్రం... సికిందరాబాద్ రైల్వేస్టేషన్