రాష్ట్రీయం

‘కుర్లా’ ఎక్స్‌ప్రెస్‌లో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, మార్చి 22: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్‌లో ఆదివారం కరోనా కలకలం రేగింది. ముంబయి-కోయంబత్తూ రు(కుర్లా) ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తిపై తోటి ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేయడంతో అతడిని గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముంబయి నుం చి తమిళనాడులోని హోసూర్‌కు బీ-4 కోచ్‌లోని బెర్త్-37లో ప్రయాణిస్తున్న షా మహ్మద్ తీవ్రంగా దగ్గుతుండటంతో తోటి ప్రయాణికులు విధి నిర్వహణలో ఉన్న టీటీఈ కిషోర్‌కు ఫిర్యాదు
చేశారు. దీంతో స్పందించిన టీటీఈ ప్రయాణికుడు షామహ్మద్‌తో చర్చించి గుంతకల్లు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో రైలు గుంతకల్లు స్టేషన్‌కు చేరుకోగానే రైల్వే వైద్యాధికారులు, ఉన్నతాధికారులు షామహ్మద్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. షా మహ్మద్‌కు అధిక జ్వరం, దగ్గు ఉండటంతో గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు చేపట్టారు.
*చిత్రం... కరోనా అనుమానిత ప్రయాణికుడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న రైల్వే వైద్యురాలు