తెలంగాణ

ఆక్టోపస్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: హైదరాబాద్‌లోని బేగంపేటలో గల ఆక్టోపస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శివకుమార్ (25) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ 13వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ శివకుమార్ ఆదివారం సెంట్రీ డ్యూటీలో ఉన్నాడు. తన సర్వీసు తుపాకి 9ఎంఎంతో కంఠం కింద కాల్చుకొని కుప్పకూలి పోయాడు. రక్తపు మడుగులో పడివున్న అతడిని తోటి సిబ్బంది సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న ఆక్టోపస్ డిజి గోవింద్ సింగ్ కానిస్టేబుల్ శివకుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. కానిస్టేబుల్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల. కాగా వ్యక్తిగత కారణాలే శివకుమార్ ఆత్మహత్యకు కారణమని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పంజగుట్ట ఎసిపి వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్ మోహన్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. ఇదిలావుండగా ఇటీవల ఓ ఎస్సై, ఎఎస్పీ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు మరువక ముందే తాజాగా ఆదివారం సాయంత్రం ఆక్టోపస్ కానిస్టేబుల్ శివకుమార్ ఆత్మహత్యకు పాల్పడడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇదిలా ఉండగా, కానిస్టేబుల్ శివకుమార్ గన్ మిస్‌ఫైర్ కావడం వల్లే మృతి చెందాడని కొంతమంది పోలీసులు అనుమానిస్తున్నారు. తుపాకి శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయినట్టు భావిస్తున్నట్టు వారు తెలిపారు.