కృష్ణ

సమన్వయంతో పుష్కర ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వివిధ శాఖలతో సీపీ సమీక్ష
విజయవాడ , మార్చి 11: కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్నందున ఏర్పాట్లపై నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ శుక్రవారం వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. కమిషనరేట్‌లో జరిగిన ఈ సమావేశానికి ఇరిగేషన్, ఆర్టీసీ, రైల్వే, పోలీసు, ఆర్ అండ్ బి, కార్పొరేషన్, నేషనల్ హైవే, తదితర శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుమారు రెండు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా పలు అంశాలపై చర్చించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన చర్యలు, ఘాట్లు, పార్కింగ్ ప్రదేశాలు, తదితర అంశాలపై మాట్లాడారు. స్నానాలకు తరలివచ్చే భక్తులు ఒకేచోట ఉండిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమీక్షించారు. ముఖ్యంగా ఆర్టీసీ, రైల్వేకు సంబంధించి సుమారు 10లక్షల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని రైళ్లు రైల్వేస్టేషన్‌కు చేరుకోవడంతో పాటు ప్రధాన స్టేషన్‌కు అనుసంధానంగా ఉన్న జిల్లాలోని వివిధ స్టేషన్లలో కూడా పుష్కర రైళ్లు ఆగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బస్సుల విషయమై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రధాన బస్టేషన్ కాకుండా నగరంలో ఆరు శాటిలైట్ స్టేషన్లు ఏర్పాటు చేసినందున కొంతవరకు సత్ఫలితాలిచ్చే అవకాశం ఉందన్నారు. ఇక పుష్కర ఘాట్లు, నగరంలో పలు కౌంటర్లు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి కూడా రైలు టిక్కెట్లు అందుబాటులో ఉంచడం ద్వారా ఒకేచోట రద్దీ లేకుండా నియంత్రించవచ్చని సూచించారు. ఇక్ జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న ప్రత్యామ్నయ మార్గాలను గుర్తించి వాటిని భక్తులకు, వాహనాల రాకపోకలకు అందుబాటులోకి తేవాలన్నారు. వీలుంటే పోలీసు కమిషనరేట్ మాదిరిగానే ప్రతి శాఖ కూడా పుష్కరాల సందర్భంగా జోన్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మానిటరింగ్ సులువవుతుందన్నారు. కమిషనరేట్‌ను 12 జోన్లు, 72 సెక్టార్లుగా ఏర్పాటు చేసేలా పుష్కర ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలో మరో సమావేశంలో మరిన్ని అంశాలపై సమీక్షించనున్నారు. సమావేశంలో రైల్వే ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్, డిఆర్‌ఎం అశోక్‌కుమార్, ఐజి చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ రైల్వే సంజయ్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, మున్సిపల్ కార్పొరేషన్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.