రాష్ట్రీయం

ఎస్‌బిహెచ్ స్కాంపై సిఐబి దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టు అదేశంతో అధికారుల విచారణ పోలీసుల అదుపులో ఆరుగురు
జాడలేని కీలక సూత్రధారి దామోదర్ నాలుగు బృందాలతో గాలింపు

హైదరాబాద్, డిసెంబర్ 5: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మల్కాజ్‌గిరి బ్రాంచిలో హవాలా మార్గంలో మళ్లిన నిధులపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మల్కాజ్‌గిరితోపాటు మరో రెండు బ్యాంకులు, ఘట్‌కేసర్, ఖమ్మం బ్రాంచి కలుపుకుని మొత్తం రూ. 50కోట్ల వరకు నిధుల మళ్లింపు జరిగినట్టు అధికారులు గుర్తిస్తుండటంతో దర్యాప్తు మరింత ముందుకుసాగుతోంది. ఎస్‌బిహెచ్ అధికారిక లిక్విడేటర్ అరవింద్ శుక్లా ఫిర్యాదు మేరకు మల్కాజ్‌గిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ భారీ కుంభకోణం కీలక సూత్రధారి మణి దామోదర్ మాత్రం పరారీలోఉన్నాడు. కాగా నిధుల మళ్ళింపుపై ముమ్మర దర్యాప్తు బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్‌కు అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ మేరకు సిబిఐ డిఐజి చంద్రశేఖర్ కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తం 13 బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిపివేశారు. ఆయా బ్యాంకుల్లోని ప్రభుత్వ నిధులు నాలుగు కోట్లు లావాదేవీలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మణి దామోదర్ కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో వున్న రిటైర్డ్ మేనేజర్ కెవి రమణరావు, మాజీ కౌన్సిలర్ వెంకటేశ్, లక్ష్మణ్, బ్యాంక్ మేనేజర్ నీరజ, రైల్వే ఉద్యోగి ఫణికుమార్‌లను విచారిస్తున్నారు. కాగా వీరు కోటి రూపాయలకు 1.5 లక్షల కమిషన్ తీసుకుంటున్నట్టు దర్యాప్తులో తేలింది. సూత్రధారి దామోదర్ మరిన్ని నిధులను మళ్లించవచ్చనే అనుమానం కలుగుతుందని, మరోసారి ప్రభుత్వ శాఖల డిపాజిట్లు పరిశీలించుకోవాలని బ్యాంకు అధికారులకు డిఐజి సూచించారు.