ఆంధ్రప్రదేశ్‌

దళితుల సమగ్రాభివృద్ధికి పునరంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి

విజయవాడ, డిసెంబర్ 29: దళితుల సమగ్రాభివృద్ధికి ఎస్‌సి కార్పొరేషన్ పునరంకితం అయ్యే దిశలో కృషి చేసేందుకు కార్పొరేషన్ అధికారులను, సిబ్బందిని సమాయత్తపరుస్తున్నట్లు ఎపి షెడ్యూల్ కులాల కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు నూతన చైర్మన్‌గా నియమితులైన జూపూడి ప్రభాకరరావు పాత్రికేయులకు చెప్పారు. స్థానిక ప్రైవేట్ హోటల్‌లో మంగళవారం 13 జిల్లాల ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లతో సంస్థ పనితీరు సుదీర్ఘంగా సమీక్షించిన అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పంజాబ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యుత్తమ పథకాలను ఇక్కడ అమలు చేస్తామన్నారు. ఇందుకోసం ఇప్పటికే 1000 కోట్ల బడ్జెట్ ఎస్‌సి కార్పొరేషన్‌కు అందుబాటులో ఉందన్నారు. ఇది కాకుండా వివిధ శాఖల్లో షెడ్యూల్ కులాల సబ్‌ప్లాన్ నిధులు 5,800 కోట్లను ఇందుకు వినియోగిస్తామని ఆయన పేర్కొన్నారు. దళితుల పేర ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములు అన్యాక్రాంతంలో ఉన్నాయని, వాటిని తిరిగి ఆయా లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు. పట్టణ ప్రాంతాల్లో దళితులకు ఇచ్చిన షాపింగ్ కాంప్లెక్స్‌లు తిరిగి ఆయా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.
ఎస్‌సి కార్పొరేషన్ ఇప్పటికే 76 వేల మంది లబ్ధిదారులను వివిద పథకాల కింద ఎంపిక చేసిందని, వీరందరికీ బ్యాంకుల సహకారంతో స్వయం ఉపాధి కలిగేలా చర్యలు చేపడతామన్నారు. ఎస్‌సి యువతకు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఎస్‌సి యువతకు బహుళ జాతి కంపెనీల ద్వారా శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలను పురస్కరించుకుని ఆంధ్రుల రాజధాని అమరావతిలో అంబేద్కర్ జీవిత విశేషాలకు సంబంధించి ఒక మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు జూపూడి ప్రభాకరరావు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 15 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు చెప్పారు.