హైదరాబాద్

ఎస్సీ వర్గీకరణ చేయాలని ఢిల్లీకి వెళ్లడం హాస్యాస్పదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 3: ఎస్సీ వర్గీకరణ చేయాలని తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లడం హాస్యాస్పదమని మాల సంఘాల నాయకులు అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాలసంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, మాల మహాసభ అధ్యక్షుడు దయానంద్ మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, జాతీయ ఎస్సీ కమిషన్ వ్యతిరేకించిన ఎస్సీ వర్గీకరణను చేస్తామని తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిస్తే సాధ్యం కాదంటూ ఖరాఖండిగా చెప్పడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. సాధ్యం కాదని తెలిసికూడా దళితుల మధ్య చిచ్చుపెట్టేందుకే కేసిఆర్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో మాలలు వివక్షతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించాల్సిన దళిత ప్రజాప్రతినిధులు జాతి ఆత్మగౌరవాన్ని వెలమదొరల ముందు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసిఆర్ ప్రభుత్వంలో కొనసాగుతున్న దళితనేతలకు చిత్తశుద్ధి ఉంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంలోని లోపాలను సరిచేస్తూ తెలంగాణ అసెంబ్లీలో ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం.. ఎస్సీ వర్గీకరణ విషయాన్ని పక్కన బెట్టి ప్రజా అనుకూల పాలన చేయాలని కోరారు. సురేష్ కుమార్, బాబూరావు, భానుప్రకాష్ పాల్గొన్నారు.