నల్గొండ

పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని నిరసన ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట , డిసెంబర్ 11: ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని ఎమ్‌ఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ పిలుపు మేరకు యాదగిరిగుట్టలో గోవుశాల నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ఎమ్‌ఆర్‌పిఎస్, ఎమ్ ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్వాలీని నిర్వహించారు. శుక్రవారం యాదగిరిగుట్ట తహసిల్ధార్ కార్యాలయం ముందు ఎమ్‌ఆర్‌పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద శంకర్ మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకు పోరాటాలు చేస్తున్నామన్నారు. పాలక పక్షం, ప్రతి పక్షపార్టీలు పార్లముంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని, బిల్లు ప్రవేశ పెట్టకపోతే అంచల వారీగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. ఈ నెల 16న కలెక్టరేట్, 17న పార్లమెంట్ వద్ద నిరసన దీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మంద శంకర్, సల్ల చంద్ర స్వామి, బర్ల శివయ్య, బొట్ల దేవేందర్, బూడిద జానీమాదిగ, పాకల ప్రవీణ్, కొనె్నవెంకటేష్, వల్లూరి ప్రభాకర్, సైదులు, నరేందర్ పాల్గొన్నారు.

రైతులు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి: కలెక్టర్
రామన్నపేట, డిసెంబర్ 11: రైతులు ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంభించి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ పి. సత్యనారాయణరెడ్డి కోరారు. మండలంలోని ఎన్నారం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రైతు ఆత్మవిశ్వాస సదస్సులో ఆయన మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు నూతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని అవలంభించాలని, సంప్రదాయ విధానాలకు స్వస్తిపలికి ఆధునిక వ్యవసాయ పద్దతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చిన్నపాటి కష్టనష్టాలకు రైతులు కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇప్పటికే రైతులను ఆదుకోవడానికి రుణమాఫీ, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతులు పోటీలుపడి అవగాహన లేకుండా పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టవద్దన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు వేగవంతంగా నడుస్తున్నాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి 12 వేల ఎకరాలు అవసరం కాగా ఇప్పటికే 9వేల ఎకరాలు సేకరించడం జరిగిందన్నారు. నీటి వనరుల లభ్యత ఆధారంగా పంటలసాగును ఎంపికచేసుకుని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించాలని అన్నారు. ప్రముఖ మనోవికాస నిపుణుడు వీరేందర్ రైతులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవిధంగా పలుకృత్యాలు చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఈ సదస్సులో వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు నర్సింహరావు, భువనగిరి సహాయ సంచాలకులు దేవ్‌సింగ్, కృషి విజ్ఞానకేంద్రం శాస్తవ్రేత్తలు వీరాంజనేయులు, రవీంద్రనాయక్, టిఎస్‌ఎంఐపి సుధాకర్, తహశీల్దార్ ప్రమోదిని, మండల వ్యవసాయాదికారి కంచర్ల మాధవరెడ్డి, విస్తరణాధికారులు వెంకన్న, శీనయ్య, సర్పంచ్ దేశపాక లక్ష్మీనర్సు, భువనగిరి, ఆలేరు డివిజన్ వ్యవసాయాధికారులు, మండలంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.