మెయన్ ఫీచర్

ప్రపంచాన్ని కుదిపేస్తున్న మత ఉగ్రవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిగ్గా రెండవ ప్రపంచ యుద్ధంనాటి వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. పెరల్ హార్బర్ మీద జపాను విమానాలు దాడి చేయటంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయింది. ఆనాటి యుద్ధం ప్రధానంగా నాజీ సైన్యాల మీద జరిగింది. అంటే హిట్లర్ ముస్సోలినీలకు వ్యతిరేకంగా బ్రిటన్ అమెరికా రష్యా వంటి దేశాలు యుద్ధంలో పా ల్గొన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓటమి తర్వాత ప్రపంచంలో అమెరికా-రష్యా రెండే అగ్ర రాజ్యాలుగా మిగియాయి. ఈ చరిత్ర దాదాపు యాభై సంవత్సరాలు కొనసాగింది. 1990 తర్వాత ఇనుప తెరల వెనుక ఉన్న డొల్లతనం ప్రపంచానికి తెలిసింది. రష్యా సా మ్రాజ్యం కూలిపోయింది. అమెరికా ఒక్కటే విశ్వ అధినేతగా మిగిలిపోయింది.
ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం తర్వాత చమురుకు ప్రాధాన్యం పెరిగింది. అదృష్టవశాత్తూ ఇసుక దేశాలల్లో చమురు నిక్షేపాలు భారీగా వెలుగులోకి వచ్చాయి. దానివల్ల పెట్రో డాలర్లు ప్రపంచాన్ని శాసించే దశకు వచ్చాయి. ఐతే వారి ఆర్థిక ప్రగతికి మత ఛాందసవాదం తోడుకావటంతో ప్రపంచ అస్తిత్వానికి ముప్పు ఏర్పడింది. అమెరికాలోని అం పైర్ బిల్డింగ్‌ను నేలకూల్చటం బొంబాయిలో విధ్వంసాలు, లం డన్ రైల్‌స్టేషన్‌లో హత్యలూ ప్రపంచపటం మీదికి మరొక కొత్త ఉగ్రవాదాన్ని తీసుకొని వచ్చాయి. తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధించాలి అని అంతర్జాతీయ సామ్యవాదులు నినాదం ఇచ్చినట్లే కాఫిర్లను నిర్మూలించి దేవుని రాజ్యం స్థాపించండి అని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు పిలుపునిచ్చారు. దాదాపు ఇరవై సంవత్సరాల యువకులకు వీరు సైనిక శిక్షణనిచ్చి వారిని మానవ బాంబులుగా మారుస్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవులు హిందువులు యూదులు కుర్దులు ఈ భూమి మీద జీవించి ఉండకూడదు- అనేది వీరి లక్ష్యం. 2015 జనవరి 7వ తేదీనాడు ఐసిస్ ఉగ్రవాదులు ఫ్రాన్సులోని ఒక పత్రికా కార్యాలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేశారు. అప్పుడే ఫ్రాన్స్ మేల్కొని ఉండవలసింది. తాత్కాలిక రాజకీయ లాభాలకోసం అమెరికా ముందు, ఇరాక్- పాకిస్తాన్ వంటి దేశాలను పోషించినా నిక్సన్ జార్జిబుష్‌ల యుగం తర్వాత తాము చేసింది ఎంత ప్రమాదకరమైన పనో అనుభవంమీద తెలియవచ్చింది.
షబ్‌నమ్‌లోనీ కాశ్మీరుకు చెందిన ఒక లా యర్. ఆమెను కొద్దిరోజుల క్రితం ఒక ఇంగ్లీ షు టి.వి.్ఛనల్‌లో చూచాను. యాంకర్ ఒక ప్రశ్నవేశాడు. ‘‘కాశ్మీర్‌లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు తమ జాతీయ జెండాలు పట్టుకొని ఊరేగుతుంటే మీరెలా సమర్ధిస్తారు?’’అని. అప్పుడు షబ్‌నమ్‌లోనీ ఇలా అన్నారు. ‘‘పాపం! వారం తా నిరుద్యోగ యువకులు. తిండికి లేక ఇలా ఊరేగింపులు చేస్తున్నారు’’అని. ఇదే నిజమైతే వీరు ఇస్లాంలోని షియా నిరుద్యోగ యువకులను కూడా ఎందుకు సంహరిస్తున్నారు?? 14 నవంబరు 2015నాడు ఫ్రాన్సులో ఒక ఫుట్‌బాల్ మాచ్ జరుగుతున్నది. దానిమీద ఐసిస్ ఉగ్రవాదులు దాడిచేసి 130 మందిని హతమార్చారు. మరొక రెండువందల మందిని క్షతగాత్రులను చేశారు. సరిగ్గా బొంబాయి లండన్ తరహా దాడులే ఇవి.
ఒక రష్యా విమానం ఈజిప్టునుండి సెయిం ట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్తుండగా సినాయ్ పర్వతాలవద్ద కూల్చివేయబడింది. అందుకు తామే బాధ్యులం అని ఐసిస్ ప్రకటించింది. ఫ్రాన్సుమీది ఈ దాడులు అంతంకాదు ఆరంభం అని ప్రకటించారు. ఇక ఫ్రాన్సు ప్రజలను నిద్రపోనివ్వం- అన్నారు. దీనిని బ్రిటీషు ప్రధాని కామెరూన్- భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ముక్తకంఠంతో ఖండించారు. ఉగ్రవాద రహిత ప్రపంచం గూర్చి వీరు ఆలోచించడం మొదలుపెట్టారు. అల్‌ఖైదా ఐసిస్ ఐఎస్‌ఐ తీవ్రత మొత్తం ప్రపంచానికి ఇప్పుడు అర్ధమయింది. కాని మనీష్ తివారీ సంజయ్‌ఝా షబ్‌నబ్‌లోనీలకు అర్ధంకాలేదు. బిహార్‌లో నితీశ్‌కుమార్, లల్లూప్రసాద్ యాదవ్‌లు, ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్ యాదవ్ పులిమీద సవారీ చేస్తున్నారు. కాని ఆకలిగొన్న పులి తర్వాత వారినే తినివేస్తుందని తెలియదా?? ఇందిరాగాంధీ లోగడ భింద్రేన్‌వాలా అనే పులిపై సవారీ చేసింది. ఫలితంగా ఆమెను 1984లో ఆ పులి తినివేసింది.
హిందువులు హిందూత్వం గురించి మాట్లాడితే దేశం ముక్కలైపోతుంది అని నవంబర్ 8న కాంగ్రెసు నాయకుడు మనీష్‌తివారీ ఒక టి.వి. ఇంటర్వ్యూలో చెప్పారు. భారత రాజకీయ నాయకులకు దూరదృష్టి లేదు. ఎంతసేపూ మైనారిటీ మూకుమ్మడి ఓట్లతో అధికారంలోకి రావాలనే తపన తప్ప దేశ భవిష్యత్తు ఏమిటన్న ఆలోచనలేదు. దేశంనిండా అజాంఖాన్‌లు పెద్దసంఖ్యలో ఉన్నారు. దేవుడు యుద్ధాలకోసమే మనలను పుట్టించి ఉంటే చెట్లకు పండ్లను కాక ఆయుధాలను మొలిపించేవాడు అని ఓ రచయిత అన్నారు. నిన్న పురస్కారాలను తిరస్కరించిన నయనతారలు సైంటిష్టు భార్గవలూ సారాజోసఫ్‌లూ అశోక్‌బాజ్‌పేయిలు ఈ మూడ వ ప్రపంచయుద్ధంలో ఎటువైపు ఉంటారు? ఫ్రాన్సు పక్షమా? ఐఎస్‌ఐఎస్ పక్షమా? ఐసిస్ దాడులకు సిరియా సంక్షోభంలో పడింది. లక్షలాది ప్రజలు కట్టుబట్టలతో శరణార్థులై యూర ప్ దేశాలల్లో తల దాచుకుంటున్నారు. లిబియాలో గడ్డాఫీ అనే పాలకుడు భూగర్భంలో నరహంతక రసాయనాయుధాల ఫాక్టరీలు నిర్మించాడు. పాలస్తీనా విమోచనా సంస్థ మధ్యప్రాచ్యంలో ఇజ్రాయల్ అనే ఒక దేశం ఉండకూడదు అని తీర్మానించింది. భారత ఉపఖండంలో సరిగ్గా పాకిస్తాన్ ఇలాంటి ఉగ్రవాద దేశమే.
‘‘తమదాకా వస్తేకాని’’ అని తెలుగులో ఒక సామెత ఉంది. ఐసిస్‌పై ఫ్రాన్సు చర్య తీసుకోవడాన్ని మొదట చైనా రష్యాలు వ్యతిరేకించినా ఇప్పుడు ఈజిప్టులో రష్యా విమానాన్ని కూల్చేసరికి రష్యన్లకు వేడి పుట్టింది. నవంబర్ 15న నాడు టర్కీలో జి-20 సమావేశం జరిగింది. సమావేశానికి సమీపంలో ఐసిస్‌వారి బాంబులు పేలాయి. దీనిని జి-20 సమావేశం తీవ్రంగా పరిగణించింది. బొంబాయిలో దాడి జరిగినప్పుడు పట్టించుకోని యూరోపియన్ సమాజం ఫ్రాన్సుపై దాడులకు ఘాటుగా స్పందించింది. ఉగ్రవాద నిర్మూలనకు అందరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు. టెర్రరిజం మూలాలు సిరియా ఇరాక్‌లలోనే కాదు పాకిస్తాన్‌లో కూడా ఉన్నాయి. పాకిస్తాన్ లోగడ తన భూభాగాన్ని రష్యాకు వ్యతిరేకంగా పోరాడే నిమిత్తం అమెరికాకు కిరాయికి ఇచ్చింది- ఇప్పుడు ఇండియాకు వ్యతిరేకంగా పోరాడే నిమిత్తం చైనాకు అద్దెకు ఇచ్చింది.
నవంబర్ 15న నాడు ఒక ఇంగ్లీషు టివి ప్రోగ్రాంలో సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ ‘‘ఐసిస్- అల్‌ఖైదాల లక్ష్యం ఇండియా- అమెరికా ఇజ్రాయల్ దేశాల నిర్మూలన కాబట్టి ఈ మూడు దేశాలు కలిసి సమష్టి ఒడంబడిక చేసుకొని పాక్- సిరియా- ఇరాక్ దేశాలలోని టెర్రరిస్టు స్థావరాలను విమాన దాడులతో నిర్మూలించాలి’’అని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని ఉగ్రవాదాన్ని నిర్మూలించే పోరుకు అమెరికాయే నేతృత్వం వహిస్తుంది అని అమెరికా మాజీ విదేశాంగ మంత్రిణి హిల్లరీ క్లింటన్ నవంబర్ 15న చేసిన ప్రకటన సరిగ్గా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ట్రూమన్ చేసిన ప్రకటనల వలెనే ఉంది. జి-20 దేశాల తీర్మానం ఈ ప్రయత్నానికి ఊతం ఇవ్వవచ్చు. ఆక్రమిత కాశ్మీర్‌లో 200 ఉగ్రవాద స్థావరాలున్నాయి. కాశ్మీర్ ముఖ్యమంత్రిణి ముఫ్తీమహమ్మద్ సయ్యద్ తాను పాక్ అనుకూల పాలకురాలిని అని చెప్పుకోవడానికి ఏమీ సంకోచించటం లేదు. జిలానీ, ఒమర్ అబ్దుల్లాలు ప్రత్యక్షంగా కాశ్మీరు లోయలో ఐఎస్‌ఐఎస్ శిబిరాలను బలపరుస్తున్నారు. కాశ్మీరు సమస్య పరిష్కారానికి నరేంద్రమోదీకి ఒక సువర్ణావకాశం లభించింది. ఆక్రమిత కాశ్మీర్ విమోచనకు భారత్‌కు ఐరాస సంపూర్ణ మద్దతునివ్వాలి!!
మాలె అతిచిన్న ద్వీపం. గత కొంతకాలంగా అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయ. ఇస్లామేతర సాంస్కృతిక చిహ్నాల విధ్వంసం మొదలైంది. ఐతే ఆ వార్తలకు అంతర్జాతీయ ప్రచారం జరుగకకుండా కొందరు సూడో సెక్యులరిస్టులు జాగ్రత్తలు తీసుకున్నారు. నవం బర్ 19న బమాకోలోని రాడిసన్ హోటల్‌లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు చొరబడి ఐక్యరాజ్య సమితికి చెందిన తొమ్మిది మంది ఉద్యోగుల ను, మరికొందరు పౌరులను తొలివిడతగా కాల్చి చంపారు. దాదాపు 170 మంది యాత్రికు లను బందీలుగా పట్టుకున్నారు. వీరిలో అమెరికన్లు, బ్రిటిష్ వారు అధికంగా ఉన్నారు. ఈ దౌర్జన్యానికి స్పందించిన మన రచయతల్లో ఒకడైనా జాతీయ పురస్కార గ్రహీత తన పురస్కారాన్ని ఎందుకు తిరస్కరించలేదు? సరి కదా మణిశంకర్ అయ్యర్, అజంఖాన్‌లు మా త్రం సమస్త సౌదీ అరేబియా ప్రపంచాన్ని ఉగ్ర వాద ప్రాంతంగా ప్రకటించడం తగదంటూ ఐఎస్‌ఐఎస్‌కు ప్రత్యక్షంగా మద్దతు ప్రకటిం చా రు. ఇప్పటివరకు మనం అల్‌ఖైదా తీవ్రవా దాన్ని మాత్రమే చూచాము. ఇప్పుడు అంతక న్నా భయంకరమైన సంస్థ సిరియాలో పురుడు పోసుకుంది. యెమెన్ లోని ఈశాన్య ప్రాంతంపై జిహాదీ ఉగ్రవాదులు నవంబర్ 20న దాడులు నిర్వహించారు. సిరియా అంతర్యుద్ధంలో ఉపయోగించే నిమిత్తం ఒకకోటి పదిలక్షల ఉత్ప్రేరకాలను జిహాదీలు పంపుతుండగా వాటి ని సరిహద్దుల వద్ద టర్కీ సైన్యాలు స్వాధీనం చేసుకున్నాయ. వీటి బరువు దాదాపు రెండు ట న్నులు ఉన్నట్టు ఆ దేశ హోంమంత్రి ప్రకటిం చాడు. దీనిని వాడటం ద్వారా జిహాదీలు దీర్ఘ కాలం ‘దేవుని రాజ్యం’ కోసం పోరాడే శక్తిని పొందగలుగుతారు. అంటే ఇవి వారి యుద్ధ వ్యాపారంలో అంతర్భాగం అని అర్థం అవుతు న్నది. ఇట్లా ఎందుకు చేస్తున్నారు? అంటే ఈ స్టెరాయడ్స్ ఉత్పత్తుల వల్ల చాలామందికి ఉపా ధి కూడా లభిస్తున్నది కదా. అని జిహాదీలు సమాధానం.
మాలెపై ఐసిస్ జరిపిన దాడిలో రష్యన్లు, అమెరికన్లు అనే తేడా లేకుండా హతమార్చ బడ్డారు. అబుబకర్ ప్రస్తుత ఐసిస్ అధినేత. బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా సరిహద్దులు చెరిపేసి మొత్తం ఉపఖండంలో ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలని భావిసు తన్నాడు. మరి మన సూడో సెక్యులరిస్టులకు ఇకనైనా కనువిప్పు కలుగుతుందా? పారిస్, మాలి ఆక్రమిత కాశ్మీర్ సిరియాలతో పాటు బెల్జియంపైకి వీరు విరుచుకు పడుతున్నారు. హైదరాబాద్ షంషాబాద్ విమానాశ్రయంలో మొయనుద్దీన్ అనే ఉగ్రవాదిని పట్టుకోవడం ద్వారా ఐసిస్ శిక్షణా కేంద్రం రిక్రూట్‌మెంట్ సెంటరు పాతబస్తీలో ఉన్నట్లు తేలింది. కొన్ని వందల మంది ఇప్పటికే ఈ సంస్థ గమ్యం చేర్చినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయ.
ఐసిస్ సిరియాలో ముస్లిమేతరులను ఇప్పటి కే మట్టుపెట్టింది. ముస్లింలలో కొన్ని వర్గాలనూ ఐసిస్ సంస్థ నిర్మూలిస్తున్నది. మణిశంకర అయ్యర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఆయన భారత దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవా దులకు అనుకూలంగా మాట్లాడాడటం తగు నా? కరాచీ వెళ్లి 2015, నవంబర్ 16న దునియా టివి అనే పాక్ ఛానల్‌కు ఇంటర్వూ ఇచ్చాడు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీని దూషించాడు. మోదీ అధికారంలో ఉన్నంతవరకు ఇండో-పాక్ శాంతి చర్చలు జరగవు అన్నాడు. విదేశీగడ్డపై భారతదేశాన్ని తన పార్టీ ప్రయోజనాలకోసం నిందించడం తగునా? ఇలాంటి వ్యక్తులపై ఆ పార్టీ ఏమి చ ర్య తీసుకుంటుంది? శ్రీమతి నజ్మా హెప్తుల్లా వంటి వారు అయ్యర్ ఇంటర్వూను ఖండిం చా రు. ఒక్కటి మాత్రం నిజం. భారతదేశంలో దేశభక్తులు ఎందరున్నారో దేశ వ్యతిరేక శక్తులు కూడా అదే స్థాయలో ఉండటం గమనార్హం.

- ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 04027425668