జాతీయ వార్తలు

భద్రత మా బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భారత్ వచ్చే ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తాం: రాజ్‌నాథ్
ఘజియాబాద్, మార్చి 11: భారత్ సందర్శించే ఏ విదేశీయుడికైనా భద్రత కల్పించడం మా బాధ్యత అనీ, ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతకు సంబంధించి దాయాది దేశం అనుమానాలు లేవనెత్తిన నేపథ్యంలో రాజ్‌నాథ్ పైవిధంగా వ్యాఖ్యానించారు. ‘పాకిస్తాన్ నుంచే కాదు, ఏ దేశంనుంచి ఏ పౌరుడు వచ్చినా భద్రత కల్పిస్తాం. ఇందులో అనుమాన పడాల్సిన అవసరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. సిఐఎస్‌ఎఫ్ ఉత్సవాలకు విచ్చేసిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ, పాకిస్తాన్ క్రికెట్ జట్టు పూర్తిస్థాయిలో భద్రత కల్పించే చర్యలు తీసుకున్నాం. పాకిస్తాన్‌కు ఈ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఆ జట్టు సభ్యులకు ప్రత్యేక భద్రత అవసరమైన పక్షంలో ఆవిధమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడం’ అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు జరిగే సమయంలో ఏ దేశంవారు వచ్చినా ప్రతి ఒక్కరికీ భద్రత కల్పిస్తామని, అది మా బాధ్యత అని పేర్కొన్నారు. విజయ్ మాల్యా అంశం గురించి విలేఖరులు ప్రస్తావించగా, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున దీనిపై తానేమీ మాట్లాడబోనని వ్యాఖ్యానించారు. ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో రెండు అఫిడవిట్లు దాఖలు చేయడాన్ని విలేఖరులు ప్రశ్నించగా, ఈ విషయమై హోంశాఖ అంతర్గతంగా పరిశీలిస్తోందని బదులిచ్చారు. (చిత్రం) సిఐఎస్‌ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూపొందించిన మ్యాగజైన్‌ను ఆవిష్కరిస్తున్న హోంమంత్రి రాజ్‌నాథ్, సిఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ సురీందర్‌సింగ్