అంతర్జాతీయం

వీటోవల్లే కాశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రతా మండలిలో పాక్ వింత వాదన
ఐక్యరాజ్య సమితి, మార్చి 11: భద్రతా మండలిలో వీటోను ఉపయోగించడమే దీర్ఘకాలిక వివాదమైన కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణమని ఐక్యరాజ్య సమితిలో మరోసారి కాశ్మీస్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్ ఆరోపించింది. భద్రతా మండలి సంస్కరణలపై ఈ నెల 9న వివిధ ప్రభుత్వాల మధ్య జరిగిన సమావేశంలో ఐక్యరాజ్య సమితిలో పాక్ రాయబారి మలీసా లోధీ మాట్లాడుతూ, భద్రతా మండలిలో వీటో ఉపయోగించడంవల్ల దీర్ఘకాలిక సమస్యగా ఉన్న కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా పోయిందని, ఈ సమస్యపై ఐక్యరాజ్య సమితి తీర్మానాల అమలుకు అది అడ్డంకిగా మారిందని అన్నారు. ఐరాసలోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో లోధీ వ్యాఖ్యలను సైతం తెలియజేశారు. ఐరాస రికార్డుల ప్రకారం కాశ్మీర్ సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని భారత్, పాక్‌లను కోరుతూ ఐర్లాండ్ 1962లో ఐరాసలో ప్రతిపాదించిన ఒక తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. కాగా, వీటో అధికారంపై పాక్ వైఖరిని లోధీ మరోసారి స్పష్టం చేస్తూ వీటో హక్కుతో, లేదా లేకుండా భద్రతా మండలికి కొత్త శాశ్వత సభ్యులను చేర్చడాన్ని తమ దేశం వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. నాన్ పర్మనెంట్ కేటగిరీలో మాత్రమే భద్రతా మండలిని విస్తరించడాన్ని పాకిస్తాన్ సమర్థిస్తుందని ఆమె స్పష్టం చేశారు. వీటో హక్కు ఉన్నంతకాలం దాన్ని కొత్త శాశ్వత సభ్య దేవాలకు కూడా వర్తింపజేయాలని, మధ్యేమార్గంగా వీటో ఉపయోగించే అంశాన్ని తదుపరి సమావేశం దాకా వాయిదా వేయాలన్న భారత్ వైఖరిని భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పునరుద్ఘాటించారు. మండలి సమగ్ర సంస్కరణలో భాగంగా పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యల్లో వీటో ఒకటని పాకిస్తాన్ భావిస్తోందని లోధీ స్పష్టం చేశారని ఆ ప్రకటన తెలిపింది. దీన్ని నిర్లక్ష్యం చేయడానికి కానీ, వాయిదా వేయడానికి కానీ వీల్లేదని ఆమె అంటూ, ఈ ప్రధాన సమస్యను వాయిదా వేయడానికి జరిపే ఏ ప్రయత్నాన్ని పాకిస్తాన్ సమర్థించబోదని, అలాగే సమీక్ష ప్రక్రియ ద్వారా దీన్ని ఇతర సభ్యులకు విస్తరింపజేసేందుకు ఎలాంటి అవకాశాన్ని కల్పించబోదని లోధీ స్పష్టం చేశారని ఆ ప్రకటన తెలిపింది.