జాతీయ వార్తలు

భారత్, చైనా మధ్య కొత్త భద్రతా వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు ఇరు దేశాల అంగీకారం

బీజింగ్, నవంబర్ 21: ఉగ్రవాదంపై పోరు, ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం చేసుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలని భారత్, చైనాలు అంగీకరించాయి. ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను నిరోధించడానికి ఇంటిలిజెన్స్ రంగంలో మరింత చురుగ్గా వ్యవహరించాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి. ఆరు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా ప్రభుత్వ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. చైనా భద్రతాధికారులతో రాజ్‌నాథ్ జరిపిన చర్చల వివరాలను శనివారం ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. రాజ్‌నాథ్ చైనా నాయకులు, భద్రతాధికారులతో సమావేశాలు జరిపారు. ‘ప్రపంచానికి పెనుసవాల్‌గా మారిన ఉగ్రవాదం, ఉగ్రవాద చర్యలను అణచివేయడానికి ఇరుదేశాలు పరస్పరం సహరించుకుంటాయి. సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలని ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి. ఉగ్రవాద సంస్థలతో ఎవరెవరికి సంబంధాలున్నాయన్న విషయంలో పరస్పరం సమాచారం అందించుకోవాలని నిర్ణయించాయి’ అని ఆ ప్రకటనలో వెల్లడించారు. సీమాంతర ఉగ్రవాదం, భద్రత విషయాల్లో ఇరుదేశాల మధ్య జరిగిన చర్చలు సత్ఫలితాలు ఇచ్చాయని భారత అధికారులు ఓ వార్తా సంస్థకు తెలిపారు. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ సరిహద్దులో మిలిటెంట్ కార్యకలాపాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ఉగ్రవాద గ్రూపులను ఏరివేత వంటి అంశాల్లో ఉమ్మడిగా పనిచేయాలని అంగీకరించాయి. హోమ్ మంత్రి పర్యటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరుదేశాల హోమ్ మంత్రుల సారధ్యంలో ఓ కొత్త భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు అధికార ప్రకటనలో పేర్కొన్నారు. ఇరుదేశాల జాయింట్ సెక్రెటరీ, డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులు ఏటా పరిస్థితులను సమీక్షిస్తారు. హోమ్‌మంత్రులు మాత్రం రెండేళ్లకోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తారు. దీనిలో భాగంగా 2016లో చైనా భద్రతా వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి నాయకత్వంలో ఉన్నతస్థాయి బృందం 2016లో భారత్‌లో పర్యటిస్తుందని ఆ ప్రకటన స్పష్టం చేసింది. కౌలాలంపూర్ ఆసియా సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రధాని లీ కెక్వియాంగ్‌లు భేటీ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఉగ్రవాదం, భద్రతకు సంబంధించి జరిగిన ఒప్పందాలు ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. **కౌలాలంపూర్‌లో చైనా ప్రధాని లీ కెక్వియాంగ్ బృందంతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ