క్రీడాభూమి

సెవాగ్‌కు సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: మాజీ క్రికెటర్ వీరేందర్ సెవాగ్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) గురువారం ఘనంగా సన్మానించింది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగవ, చివరి టెస్టుకు ముందు వీరూను బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సన్మానించి, రంజీ ట్రోఫీని జ్ఞాపికగా బహూకరించాడు. తల్లి కృష్ణ సెవాగ్, భార్య ఆర్తీ, ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వెదాంత్ కూడా హాజరుకాగా, సన్మాన గ్రహీత సెవాగ్ మాట్లాడుతూ తనకు అన్ని విధాలా సహకరించారంటూ మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనీల్ కుంబ్లేలకు కృతజ్ఞతలు తెలిపాడు. వారి నుంచి తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని అన్నాడు. సచిన్ తెండూల్కర్ పేరును అతను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. సచిన్‌తో కలిసి ఆడిన రోజులను మరచిపోలేనని అన్నాడు. తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు జీవితాంతం రుణపడి ఉంటానని 37 ఏళ్ల సెవాగ్ అన్నాడు. వేలాది మంది అభిమానులు తనకు ఎల్లవేళలా అండగా నిలిచారని, వారు లేకపోతే తాను క్రికెట్‌లో ఎదిగేవాడిని కానని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్ సందర్భంగా అంబేద్కర్ స్టేడియంలోని ఒక స్టాండ్‌కు బిసిసిఐ తాత్కాలికంగా ‘వీరూ 319’ అని నామకరణం చేసింది. టెస్టుల్లో వీరూ అత్యధిక స్కోరు 319 పరుగులు.
తొలి శతకాన్ని మరువలేను
తాను కెరీర్‌లో సాధించిన తొలి టెస్టు శతకాన్ని మరువలేనని వీరూ అన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ తనపై వనే్డ ఆటగాడిగా ముద్ర వేశారని అన్నాడు. తన బ్యాటింగ్ విధానం పరిమిత ఓవర్ల ఫార్మెట్‌కే సరిపోతుందని అభిప్రాయపడ్డారని, అందుకే రంజీ ట్రోఫీల్లో బాగా ఆడడం ద్వారా టెస్టుల్లోకి అడుగుపెట్టాలన్న నిర్ణయానికి వచ్చానని అన్నాడు. టెస్టు క్రికెట్‌లో తొలి శతకం సాధించడం తనకు ఎప్పటికీ గుర్తుంటుందని తెలిపాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో నాలుగు వందలకుపైగా పరుగులు చేసి బ్రియాన్ లారా రికార్డు బద్దలు కొట్టాలని అనుకున్నానని చెప్పాడు. అయితే, దక్షిణాఫ్రికాపై చెన్నైలోని చిదంబరం స్టేడియంలో 319 పరుగులకు అవుటయ్యానని, ఆ ఇన్నింగ్స్ నిరాశను మిగిల్చినా ఒక రకంగా ఎంతో సంతృప్తినిచ్చిందని సెవాగ్ అన్నాడు. ప్రపం చ మేటి ఆటగాళ్లతో కలిసి ఆడినందుకు ఎంతో గ ర్విస్తున్నానని అన్నాడు. తాను కెరీర్‌ను మొదలుపె ట్టినప్పుడు తన తొలి కెప్టెన్ అజయ్ జడేజా పేరు ను ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉందని అన్నాడు. అతని ప్రోత్సాహం కూడా తనకు స్ఫూర్తినిచ్చిందని వీరూ అన్నాడు. (చిత్రం) భార్య ఆర్తీ, తల్లి కృష్ణ, కుమారులు ఆర్యవీర్, వెదాంద్‌తో కలిసి గురువారం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో సన్మాన కార్యక్రమానికి హాజరైన వీరేందర్ సెవాగ్