బిజినెస్

మళ్లీ ‘ఫెడ్ రిజర్వ్’ భయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీగా నష్టపోయిన మార్కెట్లు * సెన్‌సెక్స్ 231, నిఫ్టీ 67 పాయంట్లు పతనం

ముంబయి, డిసెంబర్ 3: వడ్డీ రేటును పెంచవచ్చంటూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ యెల్లెన్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. బిఎస్‌ఇ సెన్‌సెక్స్ ఏకంగా 231 పాయింట్లు నష్టపోయి 26 వేల పాయింట్ల దిగువకు చేరుకుంది. గత రెండు వారాల్లో సెనె్సక్స్ ఒక్క రోజే ఇంతగా నష్టపోవడం ఇదే మొదటిసారి. వడ్డీ రేటు పెంచడం కోసం తాను ఎదురు చూస్తున్నట్లు బుధవారం ఆర్థిక వ్యవహారాల కమిటీ ముందు హాజరైన యెల్లెన్ చెప్పడం అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లనుంచి పెట్టుబడులు తరలివెళ్తాయన్న భయాలకు కారణమైంది. బుధవారం కూడా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలు చవి చూసిన విషయం తెలిసిందే. వరసగా నాలుగు నెలలు వృద్ధి చెందిన తర్వాత నవంబర్ నెలలో సేవా రంగం వృద్ధి స్తంభించిపోయినట్లు ఒక సర్వే పేర్కొనడం కూడా మార్కెట్ మూడ్‌పై ప్రభావం చూపించింది. ఫలితంగా ఒక దశలో 25,857.35 పాయింట్ల దిగువకు చేరిన సెన్‌సెక్స్ చివరికి 231.23 పాయింట్ల నష్టంతో 25,886.62 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 7,900 పాయింట్ల దిగువకు పడిపోయి 67.20 పాయింట్ల నష్టంతో 7,864.15 పాయింట్ల వద్ద ముగిసింది. ఒఎన్‌జిసి షేరు అత్యధికంగా 2.65 శాతం నష్టపోగా, లుపిన్, బిహెచ్‌ఇఎల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇవే కాకుండా వేదాంత లిమిటెడ్, ఐటిసి, మహింద్ర, మహింద్ర, టాటా మోటార్స, హీరో మోటో కార్ప్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు కూడా దాదాపు 2.23 శాతం దాకా నష్టపోయాయి. చెన్నై, తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో కుండపోత కారణంగా ఐటి, ఆటో రంగాల కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ రంగాలకు చెందిన షేర్లు బాగా నష్టపోయాయి. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ షేరయితే ఏకంగా ఐదు శాతం నష్టపోయింది. భారీ వర్షాల కారణంగా ఈ రిఫైనరీని బుధవారం రాత్రి మూసివేసారు. మొత్తం మీద సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 25 షేర్లు నష్టపోయాయి.