డైలీ సీరియల్

పూలకుండీలు ... కొత్త సీరియల్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొర్రెపొట్టేలు కొండను ఢీకొట్టినట్టు
చలిచీమలు కొండచిలువను సవాల్ చేసినట్టు
మేకపిల్ల తోడేలు మీదికి తొడ చరిచినట్టు
శుక్రవారంనాడు
సరిగ్గా జుమ్మా సమయాన
వృద్ధులైన తల్లిదండ్రులను, తన నలుగురు పిల్లలను వెంటబెట్టుకొని దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరంలో వున్న పాల్వంచ మున్సిపాలిటీ మంచికంటినగర్ నుండి బయలుదేరిన ఎల్లయ్య, హైదరాబాద్ నడిబొడ్డున బేగంపేట చౌరస్తాలో ఏడు చుక్కల హోటల్లా మెరిసిపోతున్న అజంతా మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ ముందుకు చేరుకున్నాడు.

అక్కడికి చేరుకున్న మరుక్షణంలోనే తను అంతకుముందే అనుకున్న ప్రకారం తల్లిదండ్రులతోనూ, పిల్లలతోనూ కలిసి హఠాత్‌గా రోడ్డుమీద బైఠాయించి ‘‘నా భార్యను ఎక్కడ దాశారో వెంటనే తీసుకొచ్చి మాకు చూపించాలి’’ అంటూ పెద్ద పెద్దగా నినాదాలు మొదలుపెట్టాడు.
‘తల్లి తోడితే పిల్ల’ అన్నట్టు ఆ వెంటనే పిల్లలు నలుగురూ తండ్రిని అనుకరిస్తూ ‘‘మా అమ్మను యాడదాసిపెట్టారో ఎంటనే తెచ్చి మాకు సూచయించండీ!’’ అంటూ అంటూనే ‘‘ఓ’’ అంటూ గట్టిగా ఏడవసాగారు..
ఆ వెంటనే ‘‘దేవతసుంటి మా కోడల్ని యాడ మాయంజేశారో? ఏమో గాని ఎమ్మటే తీసుకొచ్చి మాకొప్పజెప్తే మా తోవన మేం ఎల్లిపోతం. లేకుంటే మా శిరుసులు రోడ్డుగొట్టుకొని ఈడనే సచ్చిపోతం’’ అంటూ పెద్దగా బొబ్బరిస్తూ ఎండిపోయిన తను ఎదురురొమ్ముల మీద శబ్దం వచ్చేలా దబ్బ దబ్బ బాదుకుంటూ ఏడవసాగారు ఎల్లయ్య తల్లిదండ్రులిద్దరూ.
అసలు వాళ్ళు ఎవరో? ఎక్కణ్ణుండి వచ్చారో? అంత హఠాత్తుగా ఆ రద్దీ రోడ్డుమీద బైఠాయించి ఎందుకలా అరుస్తున్నారో? ట్రాఫిక్ పోలీసులతో సహా అక్కడున్న వాళ్ళెవ్వరికీ అర్థం కాక అలా చూస్తుండిపోయారు.
ఆ విధంగా ఓ పది నిమిషాలు గడిచేసరికి ఆ చౌరస్తా నాలుగు పక్కలా కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామైపోయింది. వాహనాల హారన్లతో పరిసరాలు హోరెత్తిపోసా గాయి.
‘‘ఇదేదో ఈ హాస్పిటల్లో వున్న పేషెంట్ల తాలూకు వాళ్ల వ్యవహారంలా వుంది’’ అనుకున్న ప్రయాణీకులు కొందరు మనకెందుకులే అన్నట్టు చోద్యం చూడసాగారు.
ఇంకొందరు ప్రయాణీకులు చెవులు గింగిర్లెత్తిపోయేలా వాహనాల హారన్లు మోగిస్తూ మాటిమాటికీ తమ తమ రిస్ట్ వాచీల్లో, సెల్‌ఫోన్లల్లో టైమ్ చూసుకోసాగారు.
అంతలో..
హాస్పిటల్ ఆవరణలో నుండి పరుగెత్తుకొచ్చిన కొంతమంది సెక్యూరిటీ గార్డులు ఎల్లయ్యవాళ్లను చూస్తూనే ‘‘మొత్తానికి వీడెవడోగాని మహామొండివాడి మాదిరిగున్నాడే! మళ్లీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడెందుకు గొడవ చేస్తున్నాడో?! ఏం కానుందో?! ఆ ఏదైతే మనకేమిట్లే హాస్పిటల్లో వాళ్ళు చెప్పినట్టు వీళ్లందరినీ ఇక్కన్నుండి గుంజి ఆవల పారెయ్యడమే మన పని. ఆపైన వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు’’ అనుకుంటూ రోడ్డుమీద కూర్చున్న వాళ్లను చుట్టుముట్టి వాళ్ళను లాగిపారెయ్యడానికి ప్రయత్నించసాగారు.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు