డైలీ సీరియల్

యమహాపురి 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్వుతూ ముందుకొచ్చి వాళ్లకెదురుగా కూర్చుంది.
ఆమె వచ్చిన బీరువా- పక్క గదిలోంచి ఈ గదిలోకి ప్రవేశమార్గం అయుండొచ్చనుకున్నాడు. శ్రీకర్ ఆ యువతిని చూసీ చూడగానే ఎక్కడో చూసినట్లుందే అనిపించింది. ‘‘పనీర్ నూడల్స్’’ అన్నాడు అప్రయత్నంగా.
ఆ మాట ఆమె వింది. మనోహరంగా నవ్వింది. ‘‘ఇన్స్‌పెక్టర్ శ్రీకర్?’’ అంది ఈశ్వర్‌తో ప్రశ్నార్థకంగా.
‘‘అంటే ఈమెకు నేను ముందే తెలుసన్నమాట. ఈశ్వర్ ఈజీ వెరీ ఇంటరెస్టింగ్’’ అనుకున్నాడు శ్రీకర్.
‘‘ఊ’’ అన్నాడు ఈశ్వర్.
‘‘మీకంటే బాగున్నాడు’’ అందా యువతి.
‘‘మీట్ మిస్ శశిపాప. మనమైతే సింపుల్‌గా శశి అంటే చాలు’’ అన్నాడు ఈశ్వర్.
శశి చెయ్యి చాచింది. శ్రీకర్ ఆమెతో కరచాలనం చేశాడు. ఊహించని వాతావరణంలో, ఊహించని విధంగా కలుసుకోవడంవల్లనేమో అతడి చేయి కాస్త వణికింది.
శ్రీకర్ చెయ్యి వదలగానే, ‘‘షి ఈజ్ మై స్పెషల్ ఇన్‌ఫార్మర్. ఇన్‌ఫార్మర్ జేమ్స్‌బాండ్ స్టైల్’’ అన్నాడు ఈశ్వర్. శ్రీకర్‌కి ఆ పరిచయం నచ్చలేదు
ఆ యువతికింకా పాతికేళ్లుండవు. అందంగా వుంది. ఆకర్షణీయంగా అలంకరించుకుంది. కలుసుకున్న పద్ధతిని బట్టి కాల్‌గర్ల్ అనిపిస్తోంది కానీ- లేకుంటే సంప్రదాయ కుటుంబపు అమ్మాయిలాగే ఉంది.
‘‘ఏమిటి మాట్లాడవు?’’ నా ఛాయిస్ నీకు నచ్చలేదా?’’ అన్నాడు ఈశ్వర్.
శ్రీకర్ తడుముకోకుండా, ‘‘్ఛయిస్ గురించి నో కామెంట్స్! షి ఈజ్ ప్రెటీ అండ్ స్వీట్. కానీ ఐటెమూ, నంబరూ, సెర్వింగూ- ఈ పదాలు నాకు చాలా ఇబ్బందిగా అనిపించాయి’’ అన్నాడు.
‘‘ఈ ప్రపంచం మగాళ్లది. ఆ విషయం పక్కాగా తెలిసేక- ఆ పదాలు నాకేం ఇబ్బందిగా అనిపించవు. నాకు లేని ఇబ్బంది మీకెందుకు?’’ అంది శశి. ఆమె గొంతు తియ్యగా వుంది. కానీ ఆ తీపిలో మత్తు లేదు.
‘‘ఎందుకంటే, నాకీ ప్రపంచం ముందు ఆడాళ్లదీ- ఆ తర్వాతే మగాళ్లది’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఇలా అనే మగాళ్లు కొందరున్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు అన్నింటినీ మెజారిటీయే నిర్ణయిస్తుంది. ఆ మెజారిటీ అభిప్రాయం, అభిరుచులు తెలుసుకున్నందుకు ఎవర్నీ అడగక్కర్లేదు. అందాల పోటీల్లో, మోడలింగులో, అడ్వర్టయిజ్‌మెంట్స్‌లో, సినీతారల్లో, సముద్ర తీరాల్లో- ఆడవాళ్ల దుస్తుల్లీ, పోకడల్నీ నిర్ణయిస్తుంది- ఆ మెజారిటీయే!’’ అంది శశి.
ఆమె ఆ మాటలు యథాలాపంగా అనలేదని శ్రీకర్‌కి అర్థమైంది. ఆమె గొంతులోని వ్యథని కూడా అతడు పసిగట్టాడు. ‘‘మీరన్నట్లు మెజారిటీ అభిప్రాయం అదే కావచ్చు. కానీ మెజారిటీ ఆడవాళ్లు దానికి తలొగ్గలేదు. ఆ విషయం మీకు తెలిసే వుండాలి’’ అన్నాడు.
శశి మళ్లీ మనోహరంగా నవ్వింది. ‘‘తెల్లదొరలు రెండొందలేళ్లు దోచుకుని మనని పేదల్ని చేసి వెళ్లారు. మనకి మనవాళ్లనుకునే నల్లదొరల పాలన వచ్చి అరవై ఏడేళ్లయింది. ఐనా మన దేశంలో పేదరికం తగ్గలేదు సరికదా పెరిగిపోతోంది. ఋణభారాలు మొయ్యలేక- రైతులు, వృత్తిపనుల వాళ్లు, ఇంకా ఎందరో సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి దౌర్భాగ్యానికి కారణమైనవాళ్లు- వాళ్ల ఓట్లతోనే బొజ్జలు పెంచి, మేడలు కట్టి, కోట్లకి పడగలెత్తుతున్నారు. సామాన్యులు వాళ్లని అసహాయంగా చూస్తుండిపోవడమే కాక, మళ్లీ మళ్లీ నేతలుగా కూడా ఎన్నుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో- సినీ హీరో ఐతే- తన వాళ్లకు జరిగిన అన్యాయానికి కారణమైన వాళ్లని వెదకి వేటాడి సర్వనాశనం చేస్తాడు. నేను మెజారిటీ మహిళల్లో ఒకతెను కాను. వాళ్లలో కథానాయికను. ఒక్కసారి మన చిత్రాల్లో కథానాయికల రూపురేఖల్నీ, వేషభాషల్నీ గుర్తుచేసుకోండి. వాళ్లకున్న కోట్లాది అభిమానుల్ని తలచుకోండి. అప్పుడు మీరు నా గురించి ఇబ్బంది పడ్డం మాని- నా అభిమానకోటిలో ఒకరౌతారని నా నమ్మకం’’ అంది.
శ్రీకర్ ఏదో అనబోతే ఆగమన్నట్లు భుజం తట్టాడు ఈశ్వర్. ‘‘లెటజ్ స్టాప్ దిస్ డిస్కషన్! నేనిక్కడికి శ్రీకర్‌ని తీసుకొచ్చింది నీతో పరిచయానికి. డిపార్టుమెంటుకి నీవల్ల ఎంత ప్రయోజనమో తెలుసుకోవడమే కాదు- శ్రీకర్ నీ వ్యక్తిత్వాన్ని కూడా స్వయంగా కలుసుకుని అర్థం చేసుకోవాలని నా ఉద్దేశ్యం’’ అన్నాడు శశితో.
‘‘ఓహో! అంటే ఇతడికి నా కథ నేనే చెప్పాలన్నమాట!’’ అంది శశి. ‘‘మరి కథ వినడానికి ఇనె్సంటివ్ కావాలి కదా, డ్రింక్స్ ఆర్డర్ చెయ్యనా?’’ అందామె.
‘‘ఓన్లీ సాప్ట్’’ అన్నాడు శ్రీకర్ వెంటనే
‘‘సరే..’’ అని ‘‘కానీ నా కథ సాప్ట్‌గా ఉండదు మరి’’ అంది శశి.
ఆమె టీపాయ్‌మీద రిమోట్ నొక్కగానే తలుపు తట్టిన చప్పుడైంది. ఈశ్వర్ వెళ్లి తలుపు తీశాడు. బాయ్ వచ్చాడు. లిచ్చీ జ్యూస్ ఆర్డర్ చేసింది శశి. బాయ్ బైటకు వెళ్లలేదు. రూం లోపలకెళ్లి ఫ్రిజ్‌లోంచి ప్యాకెట్ తీశాడు. రెండు నిముషాల్లో ట్రేలో మూడు గ్లాసులతో వాళ్లముందున్నాడు. ముగ్గురూ తలో గ్లాసూ అందుకున్నారు.
‘‘నువ్వు వెళ్లొచ్చు’’ అంది శశి. అతడు వెళ్లగానే సోఫాలో వెనక్కి వాలి జ్యూస్ సిప్ చేస్తూ కథ మొదలెట్టింది.
****
శశి అందంలో హైక్లాస్. ఆర్థికంగా మిడిల్ క్లాస్. అనుకోకుండా ప్రేమలో లోక్లాస్ అయింది.

ఇంకా ఉంది

వసుంధర